హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, మియాపూర్ ఏరియాలో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలనగర్, సనత్ నగర్, పటాన్ చెరు, కూకట్ పల్లి, గచ్చిబౌలి, చందానగర్ తదితర తప్రాంతాల్లో భారీ వర్షం కురస్తోంది. అలాగే అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, జియాగూడ, లంగర్ హౌస్, కాలిమందిర్, సన్ సిటీ, బంజరాహిల్స్, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన వర్షపు నీటితో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ పోల్స్ విరిగిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. కాగా నగరంలో మరో రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
Heavy rain with Gusty winds in Jeedimetla ⛈️⚡#Hyderabadrains pic.twitter.com/HxlwgLtvvO
ఇవి కూడా చదవండి— Hyderabad Rains (@Hyderabadrains) April 25, 2023
#25APRIL 6:45PM⚠️
GET READY #HYDERABAD!!!
HEAVY THUNDERSTORM Alert ⛈️⚡?? for Entire Hyderabad during 7-9PM⚠️⚠️⚠️
Please Stay Indoors,avoid Unnecessary Travels.#Hyderabadrains pic.twitter.com/ovy2IVGRpD
— Hyderabad Rains (@Hyderabadrains) April 25, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..