AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సీటీలో దంచికొడుతున్న వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే

భాగ్యనగరాన్ని మరోసారి మబ్బులు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ప్రజలు సాయం కోసం కాంటాక్ట్ చేయాల్సిందిగా టోల్ ప్రీ నంబర్స్ ఇచ్చింది GHMC.

Hyderabad: సీటీలో దంచికొడుతున్న వర్షం.. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే
Hyderabad Rains
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2022 | 5:45 PM

Share

Hyderabad Weather: హైదరాబాద్‌లో మళ్లీ నల్లటి మబ్బులు కమ్మేశాయి. వర్షం దంచికొడుతోంది. నగరమంతటా జోరు వాన కురుస్తోంది. ఆ ఏరియా, ఈ ఏరియా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జోరువానకు హైదరాబాద్‌ మళ్లీ అతలాకుతలమవుతోంది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.  ట్రాఫిక్‌ జామ్స్‌తో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కావడంతో.. వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది.  హైదరాబాద్‌లో వర్షాలపై GHMC మేయర్‌ సమీక్ష నిర్వహించారు. జోనల్‌ కమిషనర్లతో ఫోన్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మేయర్ విజయలక్ష్మి, ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఆపరేషన్స్‌ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి కంప్లైంట్స్‌ వస్తే వెంటనే స్పందించాలని, క్షణాల్లో స్పాట్‌కెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. యంత్రాంగమంతా 24గంటలూ అందుబాటులో ఉండాలని GHMC మేయర్‌ విజయలక్ష్మి ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమస్యలుంటే GHMC కంట్రోల్ రూమ్ నంబర్స్‌‌కు( 040-21111111, 040-29555500) సంప్రదించాలని సూచించారు. కాగా ఈ మధ్య షియర్ జోన్‌తో పాటు, రుతుపవనాల ఎఫెక్ట్‌లో తెలంగాణలోని జిల్లాలతో పాటు రాజధాని కూడా భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. అప్పటికప్పడే మబ్బులు ఏర్పడి.. భారీ వర్షం కురుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..