నైరుతి రుతుపవనాలకు తోడు.. ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.. వర్షంతో పాటు గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని.. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్టంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది..
ఇక ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు చూస్తే.. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. ఈ రోజు,రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు, భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సూర్యపేట, భువనగిరి, మెదక్, సిద్దిపేట, మాల్కజ్ గిరి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికటే.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు ప్రభావంతో ఇకనుంచి జోరుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు.
ఇదిలఉంటే.. ఏపీలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. శుక్రవారం, శనివారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారీ వర్షాల నేపధ్యంలో లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. ఇవాళ మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..