Hyderabad: తెల్లవారుతుండగానే పలకరించిన వాన.. హైదరాబాద్ లో భారీ వర్షం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

|

Jul 22, 2022 | 8:43 AM

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం చినుకులతో ప్రారంభమైన వాన మోస్తరుగా తర్వాత భారీగా మారింది. జూబ్లీహిల్స్, మూసాపేట్, కేపీహెచ్బీ, యూసుఫ్ గూడ, ఎస్సార్ నగర్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో వాన...

Hyderabad: తెల్లవారుతుండగానే పలకరించిన వాన.. హైదరాబాద్ లో భారీ వర్షం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Telangana Rains
Follow us on

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం చినుకులతో ప్రారంభమైన వాన మోస్తరుగా తర్వాత భారీగా మారింది. జూబ్లీహిల్స్, మూసాపేట్, కేపీహెచ్బీ, యూసుఫ్ గూడ, ఎస్సార్ నగర్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో వాన పడుతుంది. తెల్లవారుజామునే ప్రారంభమైన వానతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ కు వెళ్లేవారు వానలోనే తడుస్తూ పయనమయ్యారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని అమరావతి (Amaravathi) వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఫలితంగా కోస్తా, యానాం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని అంచానా వేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..