Hyderabad: అర్థ గంటలో అల్లకల్లోలం.. హైదరాబాద్‌లో దంచికొడుతోన్న వర్షం.

|

Jun 24, 2023 | 9:48 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం అర్థగంటలో అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను...

Hyderabad: అర్థ గంటలో అల్లకల్లోలం.. హైదరాబాద్‌లో దంచికొడుతోన్న వర్షం.
Rains In Hyderabad
Follow us on

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం అర్థగంటలో అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వరుణుడు దంచి కొడుతున్నాడు. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వాళ్లు అవస్థలు పడుతున్నారు. నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, కోఠి, లక్డీకపూల్‌, బేగంపేట, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైనా లింగంపల్లి, పటాన్‌చెరు, ఆర్సీపురంలో భారీ వర్షం కురుస్తోంది. ఉన్నపలంగా కురిసిన వర్షంతో ప్రయాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వర్షం నీరు భారీగా చేరింది.

ఇదిలా ఉంటే నగరంలో వర్షం కురవడం ఇది రెండో రోజు. శుక్రవారం రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ అయ్యింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..