Hyderabad Rain Alert:తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షపాతం నమోదయింది. దీంతో పలు ప్రాంతాల్లో, నీరు నిలిచిపోవడంతోపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దంటూ సూచించారు. అనవసరంగా బయట తిరిగి ఇబ్బందులకు గురి కావవద్దని పేర్కొన్నారు. వర్షాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ నంబర్ 040-21111111ను సంప్రదించాలని ఆమె సూచించారు.
భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మాన్సూన్, డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం బల్దియా అలెర్ట్ చేసింది.
Madhapur has received 92.8mm rainfall. Monsoon emergency teams are on alert. Moderate – heavy rains expected to continue. Citizens are advised to stay indoors. Dial @GHMCOnline control room on 040-21111111, for any rain-related issues & assistance. @KTRTRS @CommissionrGHMC pic.twitter.com/DTdEgrN4FN
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) June 20, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..