Hyderabad: వానొస్తే బురదొస్తుంది.. కానీ అక్కడ నురగొచ్చింది.. దాన్ని తాకారో ఇంక అంతే

Hyderabad News: భాగ్యనగరంలో వర్షం పడితే చాలా ప్రాంతాలు నీట మునుగుతుంటాయి. దీంతో ఆ కాలనీలో ఇల్లు రోడ్లు అన్ని నదులను తలపిస్తుంటాయి. దీనీ కారణంగా అక్కడి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి మన హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో కనిపిస్తూ ఉంటుంది.కానీ అక్కడ మాత్రం డిఫరెంట్. వరదతో పాటు తెల్లటి నురగ వస్తుంది. చూడడానికి అది వింతగా ఉన్న ఆ నురగ మాత్రం చాలా డేంజర్.

Hyderabad: వానొస్తే బురదొస్తుంది.. కానీ అక్కడ నురగొచ్చింది.. దాన్ని తాకారో ఇంక అంతే
Foam In Street

Edited By:

Updated on: Sep 06, 2023 | 2:32 PM

హైదరాబాద్ న్యూస్, సెప్టెంబర్ 6: భాగ్యనగరంలో వర్షం పడితే చాలా ప్రాంతాలు నీట మునుగుతుంటాయి. దీంతో ఆ కాలనీలో ఇల్లు రోడ్లు అన్ని నదులను తలపిస్తుంటాయి. దీనీ కారణంగా అక్కడి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి మన హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో కనిపిస్తూ ఉంటుంది.కానీ అక్కడ మాత్రం డిఫరెంట్. వరదతో పాటు తెల్లటి నురగ వస్తుంది. చూడడానికి అది వింతగా ఉన్న ఆ నురగ మాత్రం చాలా డేంజర్. ఇంతకీ ఆ నురగ ఎందుకు వస్తుంది ? మంచు కొండల దర్శనమిచ్చే ఆ కాలనీ ఎక్కడుంది. ఇదంతా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ లోని పలు కాలనీలు నీట మునుగుతుంటాయి. చుట్టుపక్కల కాలనీల్లోకి వరద నీరు ఉప్పొంగుతుంది. కానీ కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీ వద్ద ఉన్న ధరణి నగర్‎లో మాత్రం వరదతో పాటు తెల్లటి నురగ కూడా కాలనీ వాసులు ఇబ్బంది పెడుతుంది. కనిపించడానికి చాలా వింతగా ఉన్న పెద్ద ఎత్తున మంచి కొండ లాగా దర్శనమిస్తుంటుంది. వర్షం పడ్డ ప్రతిసారి మంచు దుప్పటి కమ్మేసినట్టు సిమ్లా, ఊటీ లాంటి మంచు ప్రాంతాల్లో తెల్లటి మంచు కొండ కనిపించిన విధంగా ఇక్కడ కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగా ఉన్న…ఆ నురగ చాలా డేంజర్ అంటున్నారు అక్కడి స్థానికులు. ఆ నురగ చర్మం పై పడిన..లేదా కంట్లో పడిన ఆసుపత్రి పాలు కావాల్సిందే. దీని ప్రభావం వల్ల అలర్జీ, దురద తమని వెంటాడుతుంది అని కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆల్విన్ కాలనీ ఉన్న ప్రాంతంలో పరికి చెరువు ఉంది. ఆ పరికి చెరువులోకి జీడిమెట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా నుండి వేస్టేజ్ తో కూడిన కెమికల్ వాటర్ ఈ పరికి చెరువులోకి చేరుతుంది. అక్కడి నుండి నాలాల ద్వారా హుసేన్ సాగర్ వరకు వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. అయితే ఈ పరికి చెరువు నుంచి ట్యాంక్‎బండ్ వెళ్లే రూట్ లో నాలా పక్కనే ఈ ధరణి నగర్ కాలనీ ఉంది. కెమికల్ వాటర్ రాగానే ఇతర వాటర్‎తో మిక్స్ అయిన క్రమంలో,ఎత్తుంపులు ఉన్న ప్రాంతాల్లో ఆ కెమికల్ వాటర్ తన స్వభావాన్ని చూపుతూ నూరగ రూపంలో మారుతుంది. ఆ నరుగా మెల్లిమెల్లిగా ఫామ్ అవుతూ భారీ కొండ లాగా ఎత్తుకు ఫామ్ అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న నాలా ఫెన్సింగ్ తో పాటు చెట్లు ఇంటి గోడలు పైకప్పు ఆనుకొని గంటలపాటు ఆ మంచుకొండ లాగా నురగ అలానే ఉండిపోతుంది.

ఇవి కూడా చదవండి

దీని కారణంగా ఆ ఇంటి వాసులు బయటికి రావాలన్న కిందికి దిగాలన్న భయపడుతున్నారు. ఆ నురగ తాకితే జారడం గానీ స్కిన్ పైన పడితే అలర్జీ లాంటివి వస్తుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఆ నురగ వచ్చిన సమయంలో ఘోరమైనటువంటి స్మెల్ వస్తుందని పూర్తిస్థాయిలో కెమికల్ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి వాసన రావడంతో ఊపిరి తీర్చుకోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనేది కాలనీవాసుల మాటలు.మా బాధలు పట్టించు కోవాలని అధికారులు కు విన్నవించు కుంటున్నారు దరణి నగర్ కాలనీ వాసులు.