వేడుకలకు కూడా ఒక పరిధి ఉండాలని తాజా ఘటన ఉదహరిస్తుంది. మితిమీరిన బర్త్ డే వేడుకలే అతడి ప్రాణం తీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి పుట్టిన రోజు సందర్భంగా అధికంగా మద్యం సేవించిన యువకుడు.. ఉదయం శవమై తేలాడు. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు తమిళనాడులోని ముళ్లిపట్టుకు చెందిన కేశవ ప్రకాశ్ (28) నగరంలోని ఓ కాల్ సెంటర్‌లో వర్క్ చేస్తున్నాడు. ఎనిమిది నెలలుగా రెజిమెంటల్ బజార్‌లోని జేఎంజే హాస్టల్‌లో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కాల్ సెంటర్‌లో జాబ్ చేసే కేశవ్ సోమవారం రాత్రి తన బర్త్ డే వేడుకలు జరుపుకొని హాస్టల్ రూమ్‌కు వచ్చాడు.
మంగళవారం ఉదయం అతను బయటికి రాకపోవడంతో హాస్టల్ నడిపేవాళ్లు తలుపులు బద్దలుకొట్టి చూడగా కేశవ్ ప్రకాశ్ తన గదిలో అచేతనంగా పడి ఉన్నాడు. షాక్‌కు గురైన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అధికంగా మద్యం సేవించడం వల్లే కేశవ్ చనిపోయినట్లు భావిస్తున్నప్పటికీ, ఇతర కారణాలు ఏవైనా ఉంటాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: