Heart Transport: తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రో రైలులో ‘గుండె’ తరలింపు.. మ‌రో పేషెంట్‌కు అమర్చేందుకు ఏర్పాట్లు

Heart Transport: మానవత్వంతో ఓ కుటుంబం ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆ కుటుంబం మంచి మనసు చేసుకుని బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి దానం చేసి..

Heart Transport: తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రో రైలులో గుండె తరలింపు.. మ‌రో పేషెంట్‌కు అమర్చేందుకు ఏర్పాట్లు

Edited By:

Updated on: Feb 02, 2021 | 6:09 PM

Heart Transport: మానవత్వంతో ఓ కుటుంబం ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆ కుటుంబం మంచి మనసు చేసుకుని బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆ వ్యక్తి గుండెను దానం చేసి ప్రాణాలు కాపాడటంతో ప్రాణాల నుంచి గట్టెక్కితున్న ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, హైదరాబాద్‌ మెట్రో రైలులో తొలిసారిగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను తరలించారు. మెట్రో రైలు అధికారుల సహాయంతో అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండెను తరలించారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో రైతు గుండెను మరో వ్యక్తికి అమర్చనున్నారు.

జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. వైద్యులు గోకులే నేతృత్వంలో ఈ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి గుండెను తరలించారు. ఉప్పల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు ఉండే ట్రాఫిక్‌ దృష్ట్యా గుండెను తరలించేందుకు వైద్యులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మెట్రో అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో గుండె తరలింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు మెట్రో అధికారులు.

Also Read: Foreign Currency Seized: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు అరెస్టు