మానవాళి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కరోనా వైరస్‌, తలకిందులైన ప్రపంచ దేశాల ఆర్ధికపరిస్థితి

చైనావాడు ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్‌ను పుట్టించాడో కానీ... అది మనల్ని వదిలి వెళ్లడం లేదు. రోజురోజుకీ మరింత పెరుగుతూ దడ పుట్టిస్తోంది..

మానవాళి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కరోనా వైరస్‌, తలకిందులైన ప్రపంచ దేశాల ఆర్ధికపరిస్థితి
Follow us

|

Updated on: Nov 24, 2020 | 11:08 AM

చైనావాడు ఏ దుర్ముహూర్తాన కరోనా వైరస్‌ను పుట్టించాడో కానీ… అది మనల్ని వదిలి వెళ్లడం లేదు. రోజురోజుకీ మరింత పెరుగుతూ దడ పుట్టిస్తోంది.. సుమారు ఏడాది కిందట పుట్టిన ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.. తలరాతలు తలకిందులు చేసేసింది.. అగ్రరాజ్యం అమెరికానే హహాకారాలు చేస్తున్నదంటే మామూలు దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో..! ఇప్పటికే 13 లక్షల మందికిపైగా ఆ మహమ్మారి బలి తీసుకుంది.. ఇంకా ఆ వైరస్‌ దాహం తీరలేదు.. సరే.. ఆ వైరస్‌ నుంచి ఎలాగోలా కోలుకున్నవారినైనా నిశ్చితంగా ఉండనిస్తుందా అంటే అదీ లేదు.. కోలుకున్నవారిలో కొంతమందికి దీర్ఘకాలం అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట! వైరస్‌ కారణంగా వచ్చే జబ్బులు ఇప్పట్లో తగ్గవట! ఇలాగని ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని అనుకుంటున్నాం కానీ అది సమస్త అవయవాలపై ప్రభావం చూపిస్తోంది.. మెదడు, గుండెలను కూడా అది నాశనం చేస్తున్నది. అసలు కరోనానే ఓ మిస్టరీ అని అంటున్నారు నిపుణులు. వైరస్‌ నుంచి కోలుకున్నవారికి రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతున్నది. ఏదో తెలియని అనాసక్తి.. నిస్సత్తువ ఆవరిస్తుందట! తలనొప్పి, గుండె, శ్వాస సమస్యలు జీవితాంతం వెంటాడుతాయట! కొందరికి కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని అంటున్నారు మేయో క్లినిక్‌కు చెందిన సైంటిస్ట్‌ గ్రెగరీ పోలాండ్‌..కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి గుండె ఎక్స్‌రేలను చూస్తే కండరాలు దెబ్బతిన్నట్టు స్పష్టమయ్యిందని చెబుతున్నారు. అంతేనా రక్తం కూడా పాడవుతుందట! రక్తంలో చిన్నపాటి ముద్దలు ఏర్పడుతాయని, వాటివల్ల గుండెకు వెళ్లే చిన్నచిన్న ధమనులు మూసుకుపోతాయని అంటున్నారు. అయితే కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న అందరిలోనూ ఇవే లక్షణాలు కనిపించడం లేదు.. కొందరిలో మాత్రమే కనిపిస్తున్నాయి.. ఇదొక్కటే కాసింత ఊరటనిచ్చే అంశం. ఇక మనిషి సగటు ఆయు ప్రమాణం కూడా కరోనా కారణంగా తగ్గిందట! అమెరికా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలు, యూరప్‌ దేశాలలో కొత్తగా పుట్టబోయే వారి ఆయుష్షు ఏడాది వరకూ తగ్గనుందని చెబుతున్నారు షాంఘై యూనివర్సిటీ వారు. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అప్లైడ్‌ సిస్టమ్స్‌ అనాలసిస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా సైంటిస్టులతో కలిసి జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని చెబుతోంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశాలలో ఆయుష్షు మూడు నుంచి ఎనిమిదేళ్ల వరకు తగ్గవచ్చంటున్నారు నిపుణులు. ఆరోగ్యం సంగతి అలా ఉంచితే కరోనా వైరస్‌ పేదలను నిరుపేదలుగా మార్చింది.. ఇప్పుడు దారిద్ర్యంతో బతుకుతున్నవారు 11.5 కోట్ల మంది ఉంటే వచ్చే ఏడాది చివరికల్లా ఈ సంఖ్య 15 కోట్లకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా కరోనా వైరస్‌ ప్రపంచగతినే పూర్తిగా మార్చేసింది.. ఇంకెన్ని ప్రమాదాలు సృష్టించబోతున్నదో చూడాలి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!