Hyderabad Mayor: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేయర్ విజయ లక్ష్మి.. పారిశుద్ధ్యం, నాళాలు పరిశీలన..

|

May 27, 2021 | 9:09 PM

Hyderabad Mayor: హైదరాబాద్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా పర్యటించారు. నగరంలో పారిశుద్ధ్యం, నాళాలు, శ్మశాన వాటికలను పరిశీలించారు.

Hyderabad Mayor: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేయర్ విజయ లక్ష్మి.. పారిశుద్ధ్యం, నాళాలు పరిశీలన..
Follow us on

Hyderabad Mayor: హైదరాబాద్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా పర్యటించారు. నగరంలో పారిశుద్ధ్యం, నాళాలు, శ్మశాన వాటికలను పరిశీలించారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, ఏఎంఓహెచ్ రవీందర్ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. బేగంపేటలోని కూకట్‌పల్లికి వెళ్లే నాలాను పరిశీలించారు. అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆమె ఆదేశించారు. అలాగే నాలా సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

అక్కడ నుండి పికెట్ నాలా వద్దకు వెళ్లిన మేయర్ విజయ లక్ష్మి.. కంటోన్మెంట్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలా సమస్యను త్వరగా పరిష్కరించాలని జోనల్‌ అధికారులను ఆదేశించారు. అటునుంచి రాంగోపాల్ పేట డివిజన్ లోని అంబేద్కర్ నగర్ కాలనీలో నాలాను పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ సుచిత్ర పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా.. వాటిని వెంటనే పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో కోటి 90 లక్షల రూపాయలతో జరిగే ఆర్‌పీ రోడ్డు నాలా పనులను మేయర్, డిప్యూటీ మేయర్ స్థానిక కార్పొరేటర్ దీపికా, మాజీ కార్పోరేటర్ హరి తో కలిసి పరిశీలించారు. డివిజన్‌లో కొందరు స్థానికులు నాలా లలో చెత్తను వేయడం గమనించిన మేయర్.. ప్రజలు దయచేసి తమ ఇంటి వద్దకు వచ్చే ఆటోలోనే చెత్తను వేయాలని కోరారు. చెత్తను నాలాలో గానీ, బయట బహిరంగ ప్రదేశాలలో గానీ వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారం లేనిదే తాము ఎంత పని చేసినా వ్యర్ధం అవుతుందన్నారు. ప్రజలు తమ వంతుగా మున్సిపాలిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని మేయర్ కోరారు.

తరువాత బన్సిలాల్‌ పేట డివిజన్ లోని హిందూ శ్మశాన వాటికను స్థానిక కార్పొరేటర్ హేమలత తో కలిసి పరిశలించారు మేయర్. స్థానికుల సమస్యలు కొన్ని తన దృష్టికి తీసుకురాగా.. వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. శ్మశాన వాటికలో ఎక్కువ పొగ బయటకు వచ్చే సమస్యలను దాదాపు చాలా చోట్ల పరిష్కరించామని, ఇక్కడ కూడా తప్పకుండా పరిష్కరిస్తామని మేయర్ అన్నారు. ఇక ఇక్కడి నుంచి నల్లగుట్ట నాలా వద్దకు వెళ్ళిన మేయర్.. అక్కడ ఉన్న చెత్తను వెంటనే తీసేయాలని మున్సిపాలిటీ వారికి సూచించారు.

బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో బస్తీ దవాఖానలో కరోనా టెస్టింగ్ సెంటర్, ఓపీ సర్వీస్ లను ఆమె పరిశీలించారు. శుక్రవారం నుంచి సూపర్ స్పైడర్స్ కి జరగబోయే వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10 లో జరుగుతున్న సీవరేజ్ పనులను మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. లాక్ డౌన్ సడలింపు సమయం ముగిసిన తరువాత కూడా గల్లీల్లో కిరాణా, చికెన్ షాప్ లు ఓపెన్ చేసి ఉండడం గమనించిన మేయర్.. వెంటనే వాటిని ముసివేయించారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో వచ్చిన షాదీ ముబారక్ చెక్ లను మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.

Also read:

Cash for vote scam : ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జ్ షీట్.. ప్రధాన నిందితుడుగా రేవంత్.. కనిపించని చంద్రబాబు పేరు.!

Viral Video: పిల్ల కాదు.. చిచ్చర పిడుగు.. చిన్నారి పట్టుదలకు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..