Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు.. నిజాంపేటలో ‘వందేమాతరం’ అంటూ నినదించిన స్థానికులు

|

Aug 15, 2022 | 2:22 PM

భాగ్యనగరంలో స్వాతంత్య్ర వేడకులను గ్రాండ్‌గా జరిపారు స్థానికులు. ప్రతి వీధిలో, ప్రతి వాడలో జాతియ జెండాలను ఎగరవేసి.. జాతీయ గీతం ఆలపించారు.

Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు.. నిజాంపేటలో వందేమాతరం అంటూ నినదించిన స్థానికులు
Independence Day
Follow us on

Independence Day 2022: దేశవ్యాప్తంగా పంద్రాగస్ట్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. యావత్‌ భారత దేశం స్వాతంత్య్ర సాధనలో కీలక భూమిక పోషించిన వీరులకు సెల్యూట్ చేస్తుంది. స్వతంత్ర భారత ఉత్సవాలను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా జరుపుకుంటున్నారు. తమ గుండెల నిండా నింపుకున్న దేశ భక్తిని ప్రదర్శిస్తున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ ఆజాదీ కా అమృత్‌(Azadi Ka Amrit Mahotsav) మహోత్సవాలను జరుపుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్టూడెంట్స్ తిరంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. దేశ భక్తి చాటారు. ఇండిపెండెన్స్ డే శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇటు భాగ్యనగరంలో కూడా స్వాతంత్య్ర వేడకులను గ్రాండ్‌గా జరిపారు. ప్రతి వీధిలో, ప్రతి వాడలో జాతియ జెండాలను ఎగరేశారు. ఈ క్రమంలోనే నిజాం పేట KNR కాలనీ విశాల్ రోడ్డులో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానికులు. కాలనీ వాసులంతా పెద్ద ఎత్తున హాజరై జెండా వందనం చేశారు. మూకుమ్మడిగా జాతీయగీతం ఆలపించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి అందరికీ వివరించారు వక్తలు. వచ్చే 25 ఏళ్లలో మెరుగైన భారతం కోసం యువత ముందుండి పనిచేయాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు..రమేశ్, వివేక్, చిత్తరంజన్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.