Tamilisai Soundara Rajan: ‘ఆ అంశం పూర్తిగా నా పరిధి లోనిదే.. నా బాధ్యతను అనుసరించే నిర్ణయం..’

|

Oct 24, 2022 | 7:52 PM

తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై మధ్య జరుగుతున్న వివాదం మరింత తీవ్ర రూపు దాల్చుతోంది. ఇరువురి మధ్య కొనసాగుతున్న విమర్శలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్...

Tamilisai Soundara Rajan: ఆ అంశం పూర్తిగా నా పరిధి లోనిదే.. నా బాధ్యతను అనుసరించే నిర్ణయం..
Tamilisai Soundararajan
Follow us on

తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై మధ్య జరుగుతున్న వివాదం మరింత తీవ్ర రూపు దాల్చుతోంది. ఇరువురి మధ్య కొనసాగుతున్న విమర్శలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ల మధ్య జరుగుతున్న వివాదం ఇప్పటికే బహిర్గతం అవగా.. అది మరింత ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మరోసారి ప్రభుత్వంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, గవర్నర్‌ తమిళిసై మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనికే వస్తుందని, గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, గవర్నర్‌గా తన బాధ్యతను అనుసరించే నిర్ణయాలు వెలువరిస్తానని తమిళిసై స్పష్టం చేశారు. అంతకుముందు కూడా గవర్నర్‌ తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా తనను జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని ఆరోపించారు. ఏనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్న తమిళిసై.. రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే వాటిని గవర్నర్ ఆమోదించాలి. ఈ సమయంలో గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్శిటీల్లో రిక్రూట్ మెంట్ కు కామన్ బోర్డు,మున్సిపాలిటీ యాక్ట్ సవరణ, ఆజామాబాద్ పారిశ్రామికాభివృద్ది చట్టం,పారెస్ట్ వర్శిటీ వంటి బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం ఉన్నాయి. త్వరలోనే ఈ బిల్లుల విషయంపై నిర్ణయం తీసుకొంటామని గవర్నర్ తమిళిసై చెప్పారు.

గతంలోనూ గవర్నర్ తమిళిసై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తానన్న తమిళిసై.. ఏది మాట్లాడినా ప్రజ‌ల కోస‌మేనని వివరించారు. ప్రజ‌ల‌కు మేలు జ‌రిగేలా హోం మంత్రితో చ‌ర్చించామ‌న్నారు. ఎవ‌రి స‌హ‌కారం అంద‌క‌పోయినా ముందుకు వెళ్తాన‌ని ఆమె తెలిపారు. తెలంగాణ‌లో ఏం జ‌రుగుతుందో తెలిసిందేన‌న్నారు. గ‌వ‌ర్నర్ ను ఎందుకు అవ‌మానిస్తున్నారో తెలంగాణ వాసులే తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..