Good News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆ డైలీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ..

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే పలు ప్యాసింజర్ రైళ్లను స్టార్ట్ చేయగా.. తాజాగా మరిన్ని డైలీ ప్యాసింజర్ రైళ్లను త్వరలో పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

Good News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆ డైలీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ..
railways

Updated on: Aug 02, 2022 | 1:26 PM

Railway News: కోవిడ్ పాండమిక్ కారణంగా రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ(Indian Railways) పునరుద్ధరిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలో ఇప్పటికే పలు ప్యాసింజర్ రైళ్లను స్టార్ట్ చేయగా.. తాజాగా మరిన్ని డైలీ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూర్చుతూ నాలుగు ప్యాసింజర్ రైళ్లను ఈ నెలలో పునరుద్ధరిస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు – తిరుపతి డైలీ ఎక్స్‌ప్రెస్ (కొత్త నెం.17261/పాత నెం.67232)ను ఆగస్టు 18 తేదీ నుంచి పునరుద్ధరిస్తారు. ఈ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు సాయంత్రం 04.30 గం.లకు గుంటూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04.25 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. అలాగే తిరుపతి – గుంటూరు డైలీ ఎక్స్‌ప్రెస్ (కొత్త నెం.17262/పాత నెం.67231)ను ఆగస్టు 19 తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు ప్రతి రోజూ సాయంత్రం 07.35 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.00 గం.లకు గుంటూరుకు చేరుకుంటుంది. ఈ ప్యాసింజర్ రైళ్లు నరసరావుపేట, వినుకొండ, దోనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానిపల్లె, ప్రొద్దటూరు, యెర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట్, కోడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో 3ఏ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

అలాగే సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్ డైలీ ఎక్స్‌ప్రెస్ (కొత్త నెం.17659/పాత నెం.57625)ను ఆగస్టు 18 తేదీ నుంచి పునరుద్ధరిస్తారు. ఈ రైలు ప్రతి రోజు సాయంత్రం 06.50 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 03.30 గం.లకు భద్రాచలం రోడ్‌కు చేరుకుంటుంది. అలాగే భద్రాచలం రోడ్ – సికింద్రాబాద్ డైలీ ఎక్స్‌ప్రెస్‌ (కొత్త నెం.17660/పాత నెం.57626)ను ఆగస్టు 19 నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు ప్రతి రోజూ రాత్రి 01.00 గం.లకు భద్రాచలం రోడ్ నుంచి బయలుదేరి.. ఉదయం 09.20 గంటలకు సికంద్రాబాద్‌కు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

Scr Railways

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..