అక్రమార్కులు బాగా తెలివి మీరిపోయారు. ముఖ్యంగా గోల్డ్ స్మగ్లర్లు తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ‘పుష్ప’ సినిమాలోని హీరో లెక్క.. అన్ని రకాల పద్దతుల్లో గోల్డ్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుడాన్ దేశానికి చెందిన మహిళ బుధవారం దుబాయ్ నుంచి EK-526 అనే విమానంలో హైదరాబాద్‌కు వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్ చేస్తుండగా.. ఆమె కదలికలు అక్కడున్న కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగించింది. దీనితో సదరు మహిళను తనిఖీ చేయగా.. ఆమె బ్యాగ్‌లో ఓ నల్లటి ప్లాస్టిక్ కవర్ కనిపించింది. అందులో గాజులుమ్ బిస్కెట్ల రూపంలో ఉన్న 1.237 కిలోల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ సుమారు రూ. 64.38 లక్షలు ఉండొచ్చునని అంచనా. కాగా, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదని నిర్ధారణకు వచ్చారు. అలాగే హైదరాబాద్‌లో ఈ బంగారం ఎవరికీ ఇచ్చేందుకు వచ్చిందా.? అనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
On 06.07.2022, Air Intelligence Unit of Hyderabad Customs, RGIA, has apprehended a female pax who arrived by EK-526 from Dubai and tried to smuggle 1237 grams gold, valued at Rs. 64.38 lakhs by concealing in her rectum.
ఇవి కూడా చదవండిFurther investigation is in progress .@cgstcushyd pic.twitter.com/7UPTgxeKYP
— Hyderabad Customs (@hydcus) July 7, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం…