Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లోని కోవిడ్ సెంటర్‌ డస్ట్‌బిన్‌లో ప్లాస్టిక్ బ్యాగ్ పడేసిన పాసింజర్.. దాన్ని విప్పి చూడగా

|

Jun 03, 2022 | 8:24 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3 కిలోల14 గ్రాముల పుత్తడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లోని కోవిడ్ సెంటర్‌ డస్ట్‌బిన్‌లో ప్లాస్టిక్ బ్యాగ్ పడేసిన పాసింజర్.. దాన్ని విప్పి చూడగా
A representative image
Follow us on

Rajiv Gandhi International Airport: గోల్డ్ స్మగ్లర్స్ అస్సలు మాట వినడం లేదు. తగ్గేదే.. లే అంటూ రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి అక్రమంగా గోల్డ్ తరలించేందుకు స్మగ్లర్స్ అన్ని రకాల పద్ధతులను వినియోగిస్తున్నారు. తాజాగా శంషాబాద్‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  దుబాయ్(Dubai) నుంచి AI-952 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై అధికారులకు అనుమానం కలిగింది. అతడు విమానాశ్రయంలోని కొవిడ్ నిర్ధారణ కేంద్రంలోకి వెళ్లడాన్ని గమనించారు.  ఆపై ఆ పాసింజర్ కొవిడ్ ల్యాబ్‌లోని.. డస్ట్‌బిన్‌లో ప్లాస్టిక్ కవర్‌ను పడేశాడు. వెంటనే అలర్టైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని.. చెత్త బుట్టలోని ప్లాస్టిక్ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని 6 చిన్న చిన్న ప్యాకెట్లు పరిశీలించగా.. 2 ప్యాకెట్లలో బిస్కెట్లు, మరో 4 ప్యాకెట్లలో పేస్ట్‌రూపంలో ఉన్న కోటి 65 లక్షల విలువైన.. 3 కిలోల 14 గ్రాముల గోల్డ్‌ని స్వాధీనం చేసుకున్నారు. కరోనా నిర్ధారణ కేంద్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి… డస్ట్ బిన్‌లో పడేసిన ప్లాస్టిక్ కవర్‌ను విమానాశ్రయం బయట అందించేలా స్మగ్లర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు కన్ఫామ్ చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు.

శంషాబాద్‌‌ ఎయిర్‌పోర్టులో గత ఎనిమిది రోజుల వ్యవధిలో బంగారం దొరకడం ఇది రెండోసారి. మే 25న దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.37.91 లక్షల విలువైన 723.39 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ పూసలు, చైన్‌లు, బ్రాస్‌లెట్ల మధ్య చిన్న చిన్న ఉంగరాల రూపంలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి వీరు పట్టుబడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి