హైదరాబాద్ (Hyderabad) లో జూబ్లీహిల్ ఘటనను మరవకముందే పాతబస్తీలో అలాంటి ఘటనే జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఓయో రూమ్ కు తీసుకెళ్లిన యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి దారుణానికి తెగబడ్డారు. పాతబస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై రెండ్రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఓయో లాడ్జిలో ఉంచి ఈ ఘటనకు పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసిన యువకులు.. ఆమెను ఓయో రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి మత్తు మందు ఇచ్చారు. అనంతరంపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లిపోయారు. అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వెంటనే అలర్ట్ అయ్యి విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా కొందరిలో నేర ప్రవర్తన మార్పు రావడం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దారుణాలు చేస్తున్నారు. మహిళలు, బాలికల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా నేరాలు ఆగడం లేదు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు జరుగుతున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా మారుతున్నాయి. హత్యలు, దాడులు, చోరీలు, వేధింపులు, అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయి. ఈ ఘఠనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నిందితుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం