Hyderabad: కొడుకు చేసిన పని తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది

కొడుకు చేసిన పని వారి పాలిట శాపంగా మారింది. కుమారుడి ప్రేమే వారి సావుకొచ్చింది. ఆఖరికి ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. వివరాలు....

Hyderabad: కొడుకు చేసిన పని తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది
representative image

Updated on: May 02, 2022 | 8:59 AM

Telangana: ప్రేమించిన యువతిని తీసుకెళ్లిన ఓ యువకుడి కుటుంబసభ్యులపై, యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. కె.పి.హెచ్.బి(Kphb) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సర్దార్ పటేల్ నగర్‌లో నివసించే శాంతయ్య ఆటో నడుపుతుండగా, అతడి భార్య ఇళ్లలో పనిచేస్తుంది. వారి కుమారుడు నరేష్ కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భగత్ సింగ్‌నగర్‌(Bhagath Singh Nagar)లో నివసించే గాయత్రి అనే యువతి నరేష్ ప్రేమించుకున్నారు. ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో, గాయత్రి, నరేష్ ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. గాయత్రి నరేష్‌తో వెళ్ళిన విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, అర్థరాత్రి శాంతయ్య ఇంటికి వచ్చి శాంతయ్య, రాజేశ్వరిలపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరిని బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు గాయత్రి బంధువులు. వారిని ఓ గదిలో బంధించి, నరేష్ ఆచూకీ తెలపాలని చిత్రహింసలకు గురిచేశారని రాజేశ్వరీ చెబుతోంది.

నరేష్ ఆచూకీ తెలపకుంటే చంపుతామని బెదిరించి వదిలివేశారని, తన భర్త చెయ్యి, రెండు చేతి వేళ్లు విరిగాయని, తమకు భయంగా ఉందని, తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బాధితులు. ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: Weather News: మండుతున్న ఎండలు.. కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ