ప్రేమికుల రోజున‌ పేదలకు కానుక‌

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:57 PM

ప్రేమికుల రోజున‌  పేదవాళ్లకు కూడా ప్రేమను పంచవచ్చంటోంది జీహెచ్ఎంసి. అందుకే వాలెంటైన్స్ డే నాడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 14న ఆకలితో అలమటించే వారి కడుపు నింపాలని జీహెచ్ఎంసి నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఉండే అనాథలకు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేయాలని తీర్మానించింది. జీహెచ్ఎంసికి తోడుగా, ఈ కార్యక్రమ౦లో భాగస్వామ్యం అయ్యేందుకు దాదాపు 100మంది హోటల్ యజమానులు ముందుకొచ్చి తమ పెద్ద మనసు చాటుకున్నారు. సోమవారం హోటల్ యజమానులు జీహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్‌ను కలిసి […]

ప్రేమికుల రోజున‌ పేదలకు కానుక‌
Follow us on

ప్రేమికుల రోజున‌  పేదవాళ్లకు కూడా ప్రేమను పంచవచ్చంటోంది జీహెచ్ఎంసి. అందుకే వాలెంటైన్స్ డే నాడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 14న ఆకలితో అలమటించే వారి కడుపు నింపాలని జీహెచ్ఎంసి నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఉండే అనాథలకు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేయాలని తీర్మానించింది. జీహెచ్ఎంసికి తోడుగా, ఈ కార్యక్రమ౦లో భాగస్వామ్యం అయ్యేందుకు దాదాపు 100మంది హోటల్ యజమానులు ముందుకొచ్చి తమ పెద్ద మనసు చాటుకున్నారు.

సోమవారం హోటల్ యజమానులు జీహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్‌ను కలిసి ఫుడ్ ప్యాకెట్లు పంపేందుకు అంగీకారం తెలిపారు. జీహెచ్‌ఎంసీ 2వేల ఫుడ్ ప్యాకెట్లను సిద్ధం చేస్తుంటే, హోటల్స్ నుంచి 10వేల ప్యాకెట్లను పంపిస్తున్నారు. ఈ ఆహార ప్యాకెట్లను జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రేమికుల రోజున‌ పంపిణీ చేయనున్నారు. ఎంతోమంది పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారిని మేయర్ ప్రశంసించారు.