Covid vaccination: శనివారం నుంచి ఇంటింటికి రెండో డోస్ వ్యాక్సినేషన్.. జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్ డ్రైవ్..

|

Oct 29, 2021 | 8:06 PM

హైదరాబాద్‌లో శనివారం ఇంటింటికి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. శనివారం నుంచి కాలనీలలో ప్రత్యేక రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం..

Covid vaccination: శనివారం నుంచి ఇంటింటికి రెండో డోస్ వ్యాక్సినేషన్.. జీహెచ్ఎంసీ పరిధిలో స్పెషల్ డ్రైవ్..
Covid Vaccination
Follow us on

GHMC Covid Vaccination: భారతదేశంలో థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో, కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్‌ వేయాలన్న ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ ఇంటింటికి టీకా పేరుతో కార్యక్రమం చేపట్టారు.  హైదరాబాద్‌లో శనివారం ఇంటింటికి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జీహెచ్ఎంసీ చేపట్టింది. శనివారం నుంచి కాలనీలలో ప్రత్యేక రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటింటికి వెళ్లి అవసరమైనవారిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ చేయనున్నట్లుగా వెల్లడిచారు. అందులోనూ మొదటి టీకా తీసుకుని.. రెండో డోస్ వేయించుకోనివారి గుర్తించి వారికి వ్యాక్సిన్ వేస్తామన్నారు.

హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ కాలనీల్లోని ప్రజలకు 100 శాతం వ్యాక్సిన్లు వేయించాలనే లక్ష్యంతో ఆరోగ్య శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేయనున్నారు. అర్హత ఉండి ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారికి టీకాలు వేసేందుకు కాలనీల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖత చూపుతున్నారు.

వ్యాక్సిన్‌ వేసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ బంద్‌ అని తెలంగాణ వైద్యశాఖ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 1 నుంచి పెన్షన్‌, రేషన్‌ కట్‌ అమలు చేస్తామని డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసింది. తెలంగాణలో మొదటి డోసు వేసుకుని.. రెండో డోస్‌ వేసుకోని వారు 35 లక్షల మంది ఉన్నారు.

డోస్‌ తీసుకోవాల్సిన డేట్‌ దాటి పోయిన వీరు వ్యాక్సిన్‌ వేసుకోవడం లేదట. దీంతో వ్యాక్సిన్‌ వేసుకోవాలని అధికారులు పదేపదే కోరుతున్నారు. కానీ కొందరు నిర్లక్ష్యం వహించడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల్లో వ్యాక్సిన్‌ వేసుకోకుంటే నవంబర్‌ 1 నుంచి రేషన్‌, పెన్షన్‌ కట్‌ చేస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి: Long Range Bomb: చైనాకు ఇక దబిడి దిబిడే.. మొన్న అగ్ని 5.. నేడు లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం..

Heart attack: గుండెపోటు వచ్చిన ఆ గంట చాలా కీలకం.. ఏం చేయాలో తెలుసుకోండి..