AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Mayor Notifications: గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

GHMC Mayor Notifications: గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం ..

GHMC Mayor Notifications: గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
Subhash Goud
|

Updated on: Jan 22, 2021 | 5:33 PM

Share

GHMC Mayor Notifications: గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపింది. అలాగే అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక ఉంటుంది. మేయర్‌ అనంతరం డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. అయితే ఈ ఎన్నిక పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారు.

కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబర్‌ 1న ఎన్నికలు జరుగగా, 4న ఫలితాలు వెలువడ్డాయి.  అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు 56 వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక 48 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక పాతబస్తీలో మరోసారి సత్తాచాటిన ఎంఐఎం 44 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లకే పరిమితమైంది. మొత్తం 52 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులను కలుపుకొంటే మేయర్‌ ఎన్నికలో ఓటు వేసేవారి సంఖ్య 202కు చేరనుంది. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే 102 మేజిక్‌ ఫిగర్‌ అవసరం ఉంటుంది. మొత్తం 52 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు అధికంగా 37, బీజేపీకి ముగ్గురు, ఎంఐఎంకు 10, కాంగ్రెస్‌కు ఒక్కరు ఉన్నారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 56 స్థానాలు గెలుచుకోగా, ఆ పార్టీకి ఉన్న ఎక్స్‌ అఫీషియో సభ్యుల సంఖ్య 37. మొత్తం కలిపితే టీఆర్‌ఎస్‌ బలం 93 ఉండనుంది. కానీ మేయర్‌ పీఠం దక్కాలంటే మరో 9 మంది సభ్యుల మద్దతు అవసరం. మరి టీఆర్‌ఎస్‌ ఏం చేయబోతోంది.? మేయర్‌ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోబోతోంది? ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అలాగే టీఆర్‌ఎస్‌ ఒకవేళ మేయర్‌ పీఠం దక్కితే కొత్త మేయర్‌ ఎవరన్న దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల ఫలితాల రోజే సింధురెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. భారతీనగర్‌ డివిజన్‌ నుంచి గెలిచిన ఆమె.. మేయర్‌ రేసులో ముందు వరుసలో ఉన్నారు.

Also Read: సీఎస్ సోమేష్‌కుమార్‌తో పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ భేటీ.. ఏం చర్చించి ఉంటారు..?