నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కొరడా.. భారీగా జరిమానా విధించిన జీహెచ్ఎంసీ అధికారులు

|

Feb 16, 2021 | 7:41 PM

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝుళిపించారు.

నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కొరడా.. భారీగా జరిమానా విధించిన జీహెచ్ఎంసీ అధికారులు
Follow us on

GHMC fines : నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ పాతబస్తీ మదీనాలో ఉన్న పిస్తా హౌస్‌కు రూ.50వేలు జరిమానా విధించింది. అలాగే, ఎల్బీ నగర్‌లోని లక్కీ రెస్టారెంట్‌కు లక్షన్నర రూపాయలు ఫైన్ వేసింది. జీహెచ్ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. నేమ్ బోర్డుపై ఫ్లాష్ లైటింగ్ ఏర్పాటు చేసినందుకు ఆయా రెస్టారెంట్లకు భారీ జరిమానాలు విధించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే నేమ్ బోర్డులను వెంటనే తొలగించుకోవాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేంది లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.