Ghmc Standing Committee
GHMC Standing Committee Meeting: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 9వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మేయర్(Mayor) మాట్లాడుతూ 9వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 10 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. లింక్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్, పార్ట్నర్ షిప్ ద్వారా చార్మినార్ మున్సిపల్ కార్యాలయం సర్దార్ మహల్ ను కల్చరల్ సెంటర్ గా అభివృద్ధి చేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించిందన్నారు. అలాగే, ఓవైసీ హాస్పిటల్ జంక్షన్ మల్టీలెవల్ ఫ్లైఓవర్‌కు భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జే అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదిస్తూ.. ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని నిర్ణయించామన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలు…
- హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా అశోక్ నగర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ. 6 కోట్ల తో చేపట్టేందుకు టెండర్లు పిలువడానికి కమిటీ ఆమోదం.
- శేరిలింగంపల్లి జోన్ లో ఐక్యా ఫ్లైఓవర్ (ఫిల్లర్ నెం.5 టూ 20) వద్ద సెంట్రల్ మీడియన్స్/ ట్రాఫిక్ ఐల్యాండ్ మెయింటెనెన్స్ కోసం సి.ఎస్.ఆర్ కింద యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ తన సొంత నిధులతో ఒక సంవత్సర కాలానికి ఎం.ఓ.యు అనుమతికి ఆమోదం.
- కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద శేరిలింగంపల్లి జోన్ సర్కిల్ నెం.20లో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ ఐక్యా ఎదురుగా గ్రీనరి ని మూడు సంవత్సరాల పాటు తమ సొంత నిధులతో మెయింటెన్ చేయుటకు ఎవోక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఎం.ఓ.యు చేయడానికి ఆమోదం.
- పబ్లిక్ ప్రైవేట్, పార్ట్నర్ షిప్ (పి.పి.పి) ద్వారా సర్దార్ మహల్ ను కల్చరల్ సెంటర్ గా బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ కోసం టర్మ్స్ అఫ్ రిఫరెన్స్ ( టి ఓ ఆర్) ప్రతిపాదనలకు ఆమోదం.
- 15 03 2022 నాటికి జీహెచ్ఎంసీ ఆదాయ, వ్యయాలు వివరాల సమాచారం సభ్యులకు వివరించడం జరిగింది.
- కూకట్ పల్లి ప్రాంతంలోని వడ్డేపల్లి ఎన్ క్లేవ్ నుండి ఎం.ఎస్.బాయమ్మ ఎన్ క్లేవ్ వరకు 10 మీటర్ల ప్రతిపాదిత రోడ్డును హెచ్.టి లైన్ బేస్ కు ఇరువైపులా ప్రతిపాదిత 18 మీటర్ల రోడ్డు వెడల్పును ఎం.ఎస్.బాయమ్మ ఎన్ క్లేవ్ నుండి ఆల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డు వరకు వెడల్పు చేయుటకు 76 ఆస్తుల సేకరణకు మాస్టర్ ప్లాన్ లో నమోదు చేయుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఆమోదం.
- సంతోష్ నగర్ చౌరస్తా ఓవైసీ హాస్పిటల్ జంక్షన్ మల్టీలెవల్ ఫ్లైఓవర్ / గ్రేడ్ సపరేటర్ కు డాక్టర్ ఎ.పి.జే అబ్దుల్ కలాం గా పేరు పెట్టుటకు ప్రభుత్వ ఆమోదం కోసం కమిటీ ఆమోదం.
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ మీటింగ్ హాల్ నందు న్యూ ఆడియో కాన్ఫరెన్సింగ్, సైమల్టేనియస్, ఇంటర్ ప్రిటేషన్ ఏర్పాటు చేయుటకు రూ. 3.80 కోట్ల అంచనా మంజూరుకు కమిటీ ఆమోదం.
- శేరిలింగంపల్లి జోన్ లో సర్కిల్ నెం.19 యూసుఫ్ గూడ నందు వార్డు నెం.99 వెంగళరావు నగర్ లో అయ్యప్ప గ్రౌండ్ వద్ద మల్టీలెవల్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ. 540 లక్షల మంజూరుకు కమిటీ ఆమోదం.
- శేరిలింగంపల్లి జోన్ లో సర్కిల్ నెం. 20 గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద మూడు సంవత్సరాల పాటు న్యూ ఫైబర్ పాట్స్ మెయింటెన్ చేయడం కోసం సీ.ఎస్.ఆర్ కింద తమ సొంత నిధులతో ఎవోక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఎం.ఓ.యు అనుమతికి కమిటీ ఆమోదం.
Read Also…. దేశ చరిత్రలో అద్భుత ఆవిష్కృతం.. గడువు కంటే ముందే చారిత్రక జోజిలా టన్నెల్.. నిర్మాణంలో మేఘా సంస్థ ఘనత!