GHMC: ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డికి జీహెచ్‌ఎంసీ షాక్‌.. ఫ్లెక్సీలను తొలగించనందుకు భారీగా జరిమానా..

GHMC Fines TRS MLA Bethi Subhash Reddy: హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు పెట్టేవారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఫ్లెక్సీలను తొలగించని వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. అది ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా

GHMC: ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డికి జీహెచ్‌ఎంసీ షాక్‌.. ఫ్లెక్సీలను తొలగించనందుకు భారీగా జరిమానా..
Bethi Subhash Reddy

Updated on: Feb 13, 2022 | 5:58 AM

GHMC Fines TRS MLA Bethi Subhash Reddy: హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు పెట్టేవారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఫ్లెక్సీలను తొలగించని వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. అది ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా డోంట్‌ కేర్‌ అంటూ కొరడా ఝలిపిస్తున్నారు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు. ఫ్లేకీలు ఏర్పాటు చేసే వారిపై భారీగా జరిమానా విధిస్తున్నారు. అది అధికార పార్టీ వారివా లేక ప్రతిపక్షానివా అన్న తేడా లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు జీఎహెచ్‌ఎంసీ అధికారులు. నగరంలో ఎక్కడ ఫ్లెక్సీలు కనిపించినా వెంటనే తొలగిస్తున్నారు. మూడు రోజుల కింద ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి (Bethi Subhash Reddy) భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. హబ్సిగూడ నుంచి ఉప్పల్‌ నల్లచెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్యలో ఏర్పాటు చేశారు. దారిపొడవునా వెలసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులపై మండిపడ్డారు స్థానికులు. ప్రభుత్వ నిబంధనలు సామాన్యులకే గాని.. ప్రజాప్రతినిధులకు వర్తించవా అంటూ ఫైరయ్యారు. ఫ్లెక్సీలను పెట్టి మూడ్రోజులవుతున్నా తొలగించడం లేదంటూ ఉప్పల్‌ మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. స్థానికులు, ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో ఉప్పల్‌ మున్సిపల్‌ అధికారులు అలెర్టయ్యారు. వెంటనే రంగంలోకి దిగి దారిపొడవునా వెలసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించారు. అంతేకాకుండా ఏకంగా ఎమ్మెల్యేకే జరిమానా విధించారు. ఫ్లెక్సీలు తొలిగించనందుకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డిని బాధ్యుడిని చేశారు. లక్షా 30 వేల రూపాయల జరిమానా విధించారు. ఎమ్మెల్యేకే జరిమానా విధించడంపై జీహెచ్‌ఎంసీ అధికారులను అభినందిస్తున్నారు స్థానికులు. రూల్‌ ఈజ్‌ రూల్‌ ఫర్‌ ఆల్‌ అని నిరూపించారని కొనియాడుతున్నారు. మున్ముందు కూడా ఇలాంటివి జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read:

Assam CM On CM KCR: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్.. ఏమన్నారంటే..?

Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధానిపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్