GHMC Election results 2020: తొలి ఫలితం వెల్లడి.. మెహదీపట్నంలో బోణి కొట్టిన ఎంఐఎం

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా..తొలుత పోస్టల్‌ ఓట్ల ఫలితాలు వెలువడ్డాయి

GHMC Election results 2020: తొలి ఫలితం వెల్లడి.. మెహదీపట్నంలో బోణి కొట్టిన ఎంఐఎం

Updated on: Dec 04, 2020 | 12:58 PM

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా..తొలుత పోస్టల్‌ ఓట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో తోలి ఫలితం వచ్చేసింది. అత్యంత తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం వెలువడింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుసేన్ విజయం సాధించారు. గతంలో మేయర్ గా పనిచేశారు మాజిద్ హుసేన్ మెహదీపట్నం డివిజన్ లో సాధించిన విజయంతో ఎంఐఎం బోణీ కొట్టింది. మాజిద్ హుసేన్ తన సమీప బీజేపీ అభ్యర్థి డి గోపాలకృష్ణ పై విజయం సాధించారు. తొలి విజయంతో ఎంఐఎం కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.