Hyderabad Rains: GHMC ఎమర్జెన్సీ అలెర్ట్.. నగర ప్రజలకు కీలక సూచనలు.. బీ కేర్‌ఫుల్

|

Jul 13, 2022 | 2:56 PM

హైదరాబాద్‌లో వానలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో GHMC ప్రజలకు కీలక సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Hyderabad Rains: GHMC ఎమర్జెన్సీ అలెర్ట్.. నగర ప్రజలకు కీలక సూచనలు.. బీ కేర్‌ఫుల్
Ghmc
Follow us on

Hyderabad Weather: ఎండను చూసి వారం అయ్యింది. వాన అప్పుడప్పుడు ఓ 10 నిమిషాలు గ్యాప్ ఇస్తుంది అంతే. వరుణుడు అస్సలు రెస్ట్ తీసుకోకుండా ఎడా పెడా వాయిస్తూనే ఉన్నాడు. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. బుధవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, నగరవాసులు అప్రమత్తంగా వుండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తోంది. తీవ్రత ఎక్కువగా వున్న బలమైన గాలుల వల్ల సిటీలోని కాలనీల్లో చెట్లు విరిగిపడే ప్రమాదం వుందని జీహెచ్ఎంసీ చెబుతోంది. మంగళవారం వీచిన బలమైన గాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. చెట్లు విరిగిపడటంతో పలువురు గాయపడ్డారు కూడా. బుధవారం కూడా బలమైన గాలుల కారణంగా కాలనీల్లో చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అవసరమైతే మినహా జంట నగరాల జనం బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడొద్దని అంటున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఎమర్జెన్సీ కోసం ఢీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని ఈవీడీఎం అధికారులు ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి