Gandhi Hospital: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగస్టు 3 నుంచి గాంధీలో అన్నిరకాల వైద్య సేవలు..

|

Jul 27, 2021 | 7:36 PM

OP Services in Gandhi Hospital: కరోనా కారణంగా చాలా ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేసుల సంఖ్య పెరడం, మరోవైపు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య

Gandhi Hospital: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగస్టు 3 నుంచి గాంధీలో అన్నిరకాల వైద్య సేవలు..
Gandhi Hospital
Follow us on

OP Services in Gandhi Hospital: కరోనా కారణంగా చాలా ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేసుల సంఖ్య పెరడం, మరోవైపు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరగడంతో.. పలు ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను నిలిపివేసి కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. దీంతో తెలంగాణ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సైతం అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 3వ తేదీ నుంచి గాందీ ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రిలో నాన్‌ కొవిడ్‌ సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాజారావు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్‌ 15న గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ సేవలు తప్ప ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు, సర్జరీలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాధారణ వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కరోనా ఉధృతి లేకపోవడంతో రోగులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు మూడు నుంచి సేవలను ప్రారంభించనున్నట్లు రాజారావు తెలిపారు.

Also Read:

Transferred: కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిపై బదిలీ వేటు.. కొత్తగా సత్యనారాయణకు బాధ్యతలు

Case on Rajgopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు.. మంత్రి జగదీష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నందుకే!