Hyderabad: పైకేమో పేరుకు ఫుడ్ క్యాటరింగ్.. తీరా చూస్తే.. జరిగేదంతా చెడుగుడు యవ్వారం!

ఆ వ్యక్తి పేరు పున్నూరు స్వామి. ఏపీలోని అనంతపూర్‌కు చెందిన వ్యక్తి. ఇక చేసేదేమో సికింద్రాబాద్‌లో ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్. పెళ్లిళ్లకు క్యాటరింగ్ బాయ్స్‌ను సప్లయ్ చేస్తుంటాడు. బాయ్స్ కోసం ముందుగా కొంత బేరం మాట్లాడి.. ఆ తర్వాత ఫంక్షన్ పూర్తి కాగానే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాడు.

Hyderabad: పైకేమో పేరుకు ఫుడ్ క్యాటరింగ్.. తీరా చూస్తే.. జరిగేదంతా చెడుగుడు యవ్వారం!
Representative Image

Edited By:

Updated on: Apr 13, 2024 | 4:53 PM

ఆ వ్యక్తి పేరు పున్నూరు స్వామి. ఏపీలోని అనంతపూర్‌కు చెందిన వ్యక్తి. ఇక చేసేదేమో సికింద్రాబాద్‌లో ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్. పెళ్లిళ్లకు క్యాటరింగ్ బాయ్స్‌ను సప్లయ్ చేస్తుంటాడు. బాయ్స్ కోసం ముందుగా కొంత బేరం మాట్లాడి.. ఆ తర్వాత ఫంక్షన్ పూర్తి కాగానే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాడు. వారు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే.. చేసేదంతా చాటుమాటున చెడుగుడు యాపారమే.. ఇలాంటి దగుల్బాజి పనులు చేస్తే దొరకకుండా ఉంటారా.? చివరికి ఓ బాధితుడి ఫిర్యాదుతో.. ఊసలు లెక్కపెట్టాడు ఈ ప్రబుద్దుడు.

వివరాల్లోకి వెళ్తే..క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న పున్నూరు స్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సాగర్ క్రైమ్ పోలీసులు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రిసెప్షన్ కోసం ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకున్నాడు. క్యాటరింగ్ కోసం స్వామి అనే వ్యక్తితో మాట్లాడి 13 మంది క్యాటరింగ్ బాయ్స్‌లను రిసెప్షన్ కోసం రప్పించారు. ఒక్కో వ్యక్తిని సర్వీస్ కోసం రూ. 550 చొప్పున కుదుర్చుకున్నాడు. ఆ సమయంలో పెళ్లివారి కాంటాక్ట్ నెంబర్లు తీసుకున్నారు. ఇక రిసెప్షన్ ముగిసిన తర్వాత రూ. 7 వేలు ఇవ్వాల్సి ఉండగా.. రూ. 15 వేలు డిమాండ్ చేశాడు స్వామి. బాధితులు అదనంగా డబ్బు ఇవ్వకపోవడంతో వారి నెంబర్లు సేకరించి కాల్ గర్ల్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. పబ్లిక్ టాయిలెట్స్‌తో పాటు మెట్రో పిల్లర్ల మీద కాల్ గర్ల్స్ కావాలంటే ఈ నెంబర్‌లకు కాల్ చేయాలంటూ డిస్‌ప్లే చేశాడు.

దీంతో బాధితులకు గంటల వ్యవధిలో వందల కాల్స్ వచ్చాయి. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనలో కీలక నిందితుడైన అనంతపురం జిల్లాకు చెందిన వున్నూరు స్వామిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అతడు మరో 11 కేసుల్లోనూ భాగమయ్యాడని ప్రాధమిక విచారణలో తేల్చారు పోలీసులు. అలాగే నిందితుదు ఖాకీలకు దొరకకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు మారుస్తూ ఉన్నాడట. ఇప్పటిదాకా మొత్తం 30 మొబైల్ నెంబర్లు వాడాడు. కాగా, నిందితుడి స్వామి నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.