Kidnap: హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో కలకలం.. ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేసిన దుండగులు

|

Sep 24, 2021 | 7:11 AM

హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇద్దరు వృద్ధురాళ్లను కిడ్నాప్ చేసిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు..

Kidnap: హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో కలకలం.. ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేసిన దుండగులు
Kidnap
Follow us on

Hyderabad – Kidnap: హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇద్దరు వృద్ధురాళ్లను కిడ్నాప్ చేసిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు. కిడ్నాప్ చేసి హైదరాబాద్ అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు కిడ్నాపర్లు. వృద్ధురాలు కేకలు వేయడంతో అమీన్ పూర్ పోలీసులకు స్ధానికులు సమాచారం ఇచ్చారు. కీలకమైన భూమి డాక్యుమెంట్స్ తోపాటు కొంత బంగారాన్ని దుండగులు తీసుకువెళ్లారని బాధితురాలు చెబుతున్నారు.

ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫైర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. చంపేస్తామని దుండగులు బెదిరించారని తమకు న్యాయం చేయాలని వృద్ధురాలు కోరుతోంది.

కాగా, కిడ్నాప్ వ్యవహారాన్ని మిరాజ్ అనే నడిపినట్టు పోలీసులు విచారణలో తెలిపారు. బాధితుల పేరు మీద అమీర్ పేట్ లో, లీలా నగర్‌లో ఉన్న కోట్ల ఆస్తి కోసమేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలాఉంటే, హైదరాబాద్‌ అంబర్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అలీకేఫ్‌ చౌరస్తా వద్ద యాక్టీవా, డీసీఎం వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

రాజధానిలోని మరో ఘటనలో.. కూకట్‌పల్లి సర్కిల్‌ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటూ సీనియర్‌ అసిస్టెంట్‌ చాంద్‌బాషా, కంప్యూటర్‌ ఆపరేటర్‌ షణ్ముగం రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డారు. ఆజ్‌బెస్టాజ్‌ కాలనీకి చెందిన నాగరాజు వ్యాపారం కోసం ట్రేడ్‌లైసెన్స్‌కి ధరఖాస్తు చేశారు. వాటి మంజూరు కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.

 

Read also: Digvijay Singh: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు, హిందూ, ముస్లిం సంతాన సాఫల్యతపై హాట్ కామెంట్స్