Telangana: గవర్నర్ ఫోన్ నే ట్యాప్ చేస్తున్నారు.. ఇక మా పరిస్థితి ఏమిటి.. మాజీ ఎంపీ వీహెచ్ విస్మయం..

|

Nov 10, 2022 | 3:05 PM

దేశంలో బిసీ జన గణన జరపాలని మాజీ మంత్రి వీహెచ్ కోరారు. ఈ విషయంపై ప్రధాని మోడీని గతంలో మూడు సార్లు కలిసినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం..

Telangana: గవర్నర్ ఫోన్ నే ట్యాప్ చేస్తున్నారు.. ఇక మా పరిస్థితి ఏమిటి.. మాజీ ఎంపీ వీహెచ్ విస్మయం..
Hanumantha Rao
Follow us on

దేశంలో బిసీ జన గణన జరపాలని మాజీ ఎంపీ వీ.హనుమంతరావు హెచ్ కోరారు. ఈ విషయంపై ప్రధాని మోడీని గతంలో మూడు సార్లు కలిసినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. బీసీ జన గణన చేపట్టి.. రిజర్వేషన్ పెంచాలన్నారు. క్రీమిలేయర్ వల్ల బీసీలు నష్టపోతున్నారన్న వీహెచ్.. ప్రధాని మోడీ ఆ వర్గాలకు ఏమీ చేయలేదని ఆక్షేపించారు. కేవలం మత్రివర్గంలో బీసీ లకు అవకాశం కల్పిస్తే న్యాయం జరగదని ఎద్దేవా చేశారు. బీసీ జనగణన జరపకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదే డిమాండ్ తో ప్రధాని మోడీని నిల దీసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వీహెచ్ స్పష్టం చేశారు. బీసీ జన గణనపై రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతానన్న వీహెచ్ ప్రజలను చైతన్యం చేస్తానని చెప్పారు. గవర్నర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పడాన్ని చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చున్నారు.

గవర్నర్ కే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని వీహెచ్ ప్రశ్నించారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర హోమ్ మంత్రి కి ఫిర్యాదు చేయాలని కోరారు. అంతే గానీ మీడియాకు చెబితే లాభం ఏమిటని నిలదీశారు. గవర్నర్ నిస్సహాయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్న వీహెచ్ గవర్నర్ ఫిర్యాదు చేసే అంశాలపై కేంద్రం స్పందించాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారని, తానేమీ మాట్లాడదలచుకోవడం లేదని వీహెచ్ స్పష్టం చేశారు.

మరోవైపు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా బీసీల జనాభా గణనలోకి తీసుకోలేకపోవడం ఆశ్చర్యకరం. కుల గణన ద్వారా వెనకబడిన మెజారిటీ ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చు. విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది. కుల గణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని తెలిపింది. అయితే.. ప్రస్తుతం కులాల వారి జన గణన ఒక్కటే పరిష్కార మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం