
72 మిస్‌వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 109 దేశాల సుందరీమణులకు ప్రభుత్వం తెలంగాణలోని ప్రసిద్ధ ప్రదేశాలను చూయిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులను ప్రభుత్వం తెలంగాణలోని నాగార్జున సాగర్,ఛార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వెయ్యి స్తంభాల గుడి,రామప్ప గుడి, యాదగిరి గుట్టా ఇలా అన్ని ప్రదేశాలకు తీసుకెళ్లింది. కానీ ప్రపంచంలో గొప్పగా హైదరాబాద్ నడి ఒడ్డున నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం వద్దకు తీసుకువెళ్లడం ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు.
జూన్ 2వ తేదీన మిస్ వరల్డ్ విజేతలు, పోటీదారులను గవర్నర్ వద్దకు తీసుకువెళ్తున్నారని.. అయితే గవర్నర్ వద్దకు తీసుకెళ్లే ముందే వారికి సెక్రటేరియెట్ ముందు ఉన్న అమరజ్యోతిని చూపించాలని మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆయన మాట్లాడారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు.. కమీషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఏం నోటీసులు ఇచ్చారు, నోటీసుల్లో ఏముందో తెలిసిన తర్వాత దనిపై స్పందిస్తానని ఆయన అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..