హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే అరుదైన ఫార్ములా కార్ రేస్ ట్రాయల్ రన్ ప్రారంభమైంది. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫార్ములా ఫ్యూయల్ కార్ల రేస్.. ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరాన జరుగుతున్న ఈ కార్ రేసింగ్ షోను చూసేందుకు.. సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా హాజరయ్యారు. హుసేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు ప్రేక్షకులతో నిండిపోయాయి. ఈ ఫ్యూయల్ కారు రేసులో 6 టీమ్స్, 12 కార్స్, 24 మంది రైడర్స్ ఈ రేసులో పాల్గొంటున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ఫార్ములా రేస్ కార్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. ఇందులో ఆరు ప్రధాన నగరాల నుంచి ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 12 కార్లు ట్రాక్‌పై రయ్ మని దూసుకెళ్లనున్నాయి.
హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ పై స్పోర్ట్స్ కార్లు పరుగులు పెడుతున్నాయి. అయితే ఇప్పుడు జరిగేది ఫ్యూయల్ కార్ల రేస్. ఎలక్ట్రికల్ కార్లు కాదు. ఫార్ములా-e జరిగేది ఫిబ్రవరిలో.. అప్పుడే ఎలక్ట్రికల్ కార్లు ఉంటాయి. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ఫ్యూయల్ కార్లతో 6 టీమ్స్ పాల్గొంటున్నాయి.
ఇండియాలో ఇదే తొలి స్ట్రీట్ సర్క్యూట్. ఇందుకు విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ వేదిక కావడం తెలుగు వారికి ప్రత్యేకంగా నిలుస్తోంది. శని, ఆదివారం జరిగే ఈ రేస్‌లో మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటున్నారు. ఈ కార్ రేసింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
ఫార్ములా కార్ రేసింగ్ జరుగుతుండటంతో ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐమ్యాక్స్ పక్క నుంచి రేస్ ప్రారంభమై..ఎన్టీఆర్ మార్గ్ మీదుగా.. లుంబినీ పార్క్ ముందు యూ టర్న్ తీసుకుని ఎన్టీఆర్ పార్క్ లోపల వేసిన ట్రాక్ నుంచి ఐ మ్యాక్స్ మీదుగా తిరిగి ఐమాక్స్ పక్కకు చేరుకోవడంతో ఈ రేస్ ముగియనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం