Car Fire Short Circuits: గచ్చిబౌలిలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజన్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఈ మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కారులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారులో షార్ట్ సర్క్యూట్ వల్లనో, ఇంకేదైన కారణంగానో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు కారులోని సజీవదహనమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే కారులో ప్రయాణించే ముందు అన్ని కూడా చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి రోజు కూడా ఇంజన్‌లో మార్పులను గమనించాలని, ఇంకా గ్యాస్ సిలిండర్లు కలిగిన కార్లు చాలా ప్రమాదమని, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.