Fake Certificate: విజయవాడలో రెచ్చిపోయిన ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా.. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు..

Fake Certificate: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఉద్యోగం పేరుతో నమ్మించి ఓ వ్యక్తికి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ కాపీని ఇచ్చారు.

Fake Certificate: విజయవాడలో రెచ్చిపోయిన ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా.. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 9:40 PM

Fake Certificate: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఉద్యోగం పేరుతో నమ్మించి ఓ వ్యక్తికి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ కాపీని ఇచ్చారు. కానీ దానిని అధికారులు గుర్తించడంతో అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకెళితే.. విజయవాడలోని వించిపేటలో నివసిస్తున్న సైఫుద్దీన్.. విజయవాడలోని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను సంప్రదించాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పదవికి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు, ఏపీ పత్రాన్ని చూపించాడు. ఆ ఉత్తర్వుల్లో ఏపీ సీఎస్ ఆమోదం మేరకు జీఏడీ డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్ ఇచ్చినట్లుగా ఉంది. అయితే సీఎస్ నుంచి ఎటువంటి ఆర్డర్లు రావని, ఇది నకిలీ అపాయింట్మెంట్ అని అధికారులు తేల్చారు. దీనిపై సైఫుద్దీన్‌కు నిలదీయగా.. సురేంద్ర అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించాడు.

దాంతో ఈ నకిలీ ముఠా గుట్టు రట్టు అయ్యింది. మార్క్స్ మెరిట్ ఆధారంగా తాను 10 మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు సురేంద్ర సైఫుద్దీన్‌ను నమ్మించాడు. అది నమ్మిన సైఫుద్దీన్.. ఉద్యోగం కోసం సురేంద్రతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం మేరకు ముందుగా రూ.82,000 చెల్లించాడు. దానిలో భాగంగా సురేష్.. సైఫుద్దీన్‌కు నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చి పంపాడు. దాంతో అసలు విషయం వెలుగు చూసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న రవాణా శాఖ అధికారులు.. కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also read:

AP Local Body Elections: ఆ రెండు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్చిన ఎస్​ఈసీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

Lashkar Festival Income: కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న ల‌ష్క‌ర్ ఆదాయం ఎంతంటే..? మూడు రోజుల్లో న‌ల‌భై ల‌క్ష‌లు…