AP Local Body Elections: ఆ రెండు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్చిన ఎస్ఈసీ.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
ఏపీ ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు పశ్చిమగోదావరి,ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ప్రకటించింది.

AP Local Body Elections: ఏపీ ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల వినతి మేరకు పశ్చిమగోదావరి,ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ప్రకటించింది. ఒంగోలులో ఉన్న 20కి గాను 15 మండలాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒంగోలు డివిజన్లో మిగిలిన 5 మండలాలైన కొరిశపాడు, జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13న రెండో దశలో ఎన్నికలు జరపనుంది ఎస్‌ఈసీ.
ఇక పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3వ దశకు బదులు ఫిబ్రవరి 13న రెండోదశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకు ఎన్నికల తేదీల్లో మార్పులు జరిగాయి. లింగపాలెం , జె.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట, మండలాల్లో 4వ దశకు బదులు ఫిబ్రవరి 17న 3వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: