Andhra Pradesh Govt: ఎస్ఈసీ ప్రొసీడింగ్స్‌ను తిప్పి పంపండి.. కేంద్రానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Andhra Pradesh Govt: సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌పై..

Andhra Pradesh Govt: సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌పై ఎస్ఈసీ ప్రొసీడింగ్స్‌ను తిప్పి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఐఏఎస్ అధికారుల పట్ల ఎస్ఈసీ తీరు దారుణంగా ఉందని లేఖలో ఏపీ సర్కార్ పేర్కొంది. కేంద్రానికి ఏపీ సర్కార్ రాసిన లేఖ ప్రకారం.. ‘ఇద్దరు అధికారులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు ఎస్ఈసీ ఫిర్యాదు చేశారు. వారిపై అవమానకర రీతిలో లేక రాయడమే కాకుండా వారికి కంపల్సరీ రిటైర్‌మెంట్ ప్రకటించాలని ఎస్ఈసీ కోరింది. కానీ, ఇది ఎస్ఈసీ పరిధిలోని అంశం కాదు. సెన్సుర్ అనేది మైనర్ పెనాల్టీ కిందకి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. అభియోగాలను సర్వీస్ రికార్డ్స్‌లో పొందుపరచాలని ఎస్ఈసీ ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను అతిక్రమించడమే అవుతుంది. ఎస్ఈసీ ఆదేశాలు చట్ట ఉల్లంఘన కిందకు వస్తాయి. ఎస్ఈసీ ప్రొసీడింగ్స్‌ను తప్పి పంపాలి.’ అంటూ కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది.
కాగా, తాజా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపకల్పనలో విఫలమయ్యారంటూ పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌లపై అభిశంసన ఆదేశాలను అమలు చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రొసీడింగ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అలాగే కేంద్రానికి సైతం ఆయన లేఖ రాశారు. అయితే, ఎస్ఈసీ ప్రొసీడింగ్స్‌ను ఏపీ సర్కార్ వ్యతిరేకించింది. అధికారులపై ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఎస్ఈసీకి లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. ఆమేరకు ప్రొసీడింగ్స్‌ను వెనక్కి పంపారు. ఈ క్రమంలోనే కేంద్రానికి ఎస్ఈసీ పంపిన ప్రొసీడింగ్స్‌ను కూడా వెనక్కి పంపాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
Also read:
ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన వృద్ధ మహిళ.. అందులో బంగారు ఆభరణాలు.. డ్రైవర్ ఏం చేశాడో తెల్సా..?