Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన ‘వంటలక్క కూతురు’.. తన ముద్దు ముద్దు మాటలతో..

Green India Challenge By Karthika Deepam Fame: ప్రస్తుతం తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాగా పాపులర్ అవుతోంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన ఈ చాలెంజ్‌ను సెలబ్రిటీలు స్వీకరిస్తూ ఇతరులకూ విసురుతున్నారు...

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన ‘వంటలక్క కూతురు’.. తన ముద్దు ముద్దు మాటలతో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 28, 2021 | 6:56 PM

Green India Challenge By Karthika Deepam Fame: ప్రస్తుతం తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాగా పాపులర్ అవుతోంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన ఈ చాలెంజ్‌ను సెలబ్రిటీలు స్వీకరిస్తూ ఇతరులకూ విసురుతున్నారు. దీంతో మొక్కల పెంపకంపై అందరిలోనూ ప్రాధాన్యత పెరుగుతోంది.

ఇదే క్రమంలో తాజాగా కార్తీక దీపం ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ కృతిక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. మరో ఆర్టిస్టు ప్రత్యూష విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన కృతిక నార్సింగి సమీపంలోని మంచిరేవుల వద్ద మొక్కలు నాటింది. ఈ చిన్నారి మొక్కలు నాటుతోన్న సందర్భంగా తీసిన వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. వీడియో చిన్నారి కృతిక ముద్దు ముద్దు మాటలతో మొక్కలు నాటండంటూ, చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తనను భాగస్వామ్యం చేసినందుకుగాను టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపిన కృతిక.. ఈ ఛాలెంజ్‌ను ప్రేమి విశ్వనాథ్‌(వంటలక్క), డాక్టర్‌ బాబు నిరూపమ్‌, ప్రొడ్యుసర్‌ వెంకటేశ్వర రావు గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొనాలని కోరింది. ఇక ఈ ట్వీట్‌తో పాటు ఎంపీ సంతోష్ కుమార్.. ఈ కార్యక్రమంలో కృతిక భాగస్వామ్యం ఇతర యువతకు స్ఫూర్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు.

Also Read: Virata Parvam: రానా-సాయిపల్లవి మూవీ ‘విరాటపర్వం’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌.. ఎప్పుడంటే?

మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video