Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి!

Fire Accident: భవనంలో మొత్తం 30 మంది ఉంటున్నారని స్థానికులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 10 ఫైరింజన్లు చేరుకున్నాయి. అలాగే ఘటన స్థలానికి 10 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. మంటలు భారీగా వ్యాపించడంతో చార్మినార్‌కు వెళ్లే దారులను మూసివేశారు. ఏమైందో తమకు..

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి!

Updated on: May 18, 2025 | 10:46 AM

హైదరాబాద్‌లోని మీర్‌చౌక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుల్జార్‌హౌస్‌ దగ్గర ఉన్న భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. ఈ భవనంలో నాలుగు కుటుంబాలు చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతోపాటు 14 మందికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

భవనంలో మొత్తం 30 మంది ఉంటున్నారని స్థానికులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 10 ఫైరింజన్లు చేరుకున్నాయి. అలాగే ఘటన స్థలానికి 10 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. మంటలు భారీగా వ్యాపించడంతో చార్మినార్‌కు వెళ్లే దారులను మూసివేశారు. ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మృతి చెందిన వారిలోఅభిషేక్‌ మోడీ (30), ఆరుషి జైన్‌ (17), హర్షాలి గుప్తా (7), షీతల్‌ జైన్‌ (37), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72), ఇరాజ్‌ (2) ఉన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి