హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్వాన్‌లోని ఫర్నీచర్ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేయడంతో.. ఊపిరి ఆడక పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్నా అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.