Hyderabad: ప్రేమ పేరుతో అఘాయిత్యం.. జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం కేసులో సినీ నటుడు అరెస్ట్..

|

Oct 12, 2022 | 3:33 PM

వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ రావును హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Hyderabad: ప్రేమ పేరుతో అఘాయిత్యం.. జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం కేసులో సినీ నటుడు అరెస్ట్..
Priyanth Rao
Follow us on

వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ రావును హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగా మా ప్రయాణం’’ సినిమా హిరో ప్రియాంత్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే యువతి పెళ్లి మాట ఎత్తగా మాట దాటేయడంతో అసలు విషయం బయటపడింది.

ప్రియాంత్‌కి ముందే పెళ్లి అయ్యింది.. ఇదేంటని ఆ యువతి నీలదీయగా, నా భార్య అంటే ఇష్టం లేదని, తనకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని యువతి ఆరోపిస్తోంది. ఏంతకి అతడు పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె నీలదీయగా చంపేస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది..దీంతో అప్పటి నుండి పోలీసుల కంటపడకుండా లాయర్‌తో వ్యవహారం నడిపిస్తున్న ప్రియాంత్‌ను..ఎట్టకేలకు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు.

ప్రియాంత్‌రావుపై జూ.ఆర్టిస్ట్‌ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు.. చీటింగ్, రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.