Hyderabad: భార్యతో గొడవ.. చూస్తుండగానే భవనం పైనుంచి దూకిన భర్త.. చివరకు..

|

Feb 07, 2023 | 12:30 PM

హైదరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మద్య జరిగిన ఓ చిన్న గొడవ భర్త ప్రాణాలు తీసుకునేలా చేసింది. భవనంపై నుంచి..

Hyderabad: భార్యతో గొడవ.. చూస్తుండగానే భవనం పైనుంచి దూకిన భర్త.. చివరకు..
Wife Husband representative image
Follow us on

హైదరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మద్య జరిగిన ఓ చిన్న గొడవ భర్త ప్రాణాలు తీసుకునేలా చేసింది. భవనంపై నుంచి దూకి భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ శివారు నార్సింగిలో చోటుచేసుకుంది. భార్య చూస్తుండగానే భర్త భవనం పైనుంచి దూకేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీరంచెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మంగళవారం ఉదయం రేవన్‌ సిద్ధప్ప అనే వ్యక్తికి తన భార్య మధ్య గొడవ జరిగింది. చిన్నపాటి గొడవ కాస్త పెద్దదయింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రేవన్‌ సిద్ధప్ప దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

గొడవ అనంతరం ఒక్కసారిగా భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో సిద్ధప్పకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన అతణ్ణి ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ రేవన్‌ సిద్ధప్ప మృతిచెందాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..