Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని తండ్రీకూతురు మృతి!

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల నుంచి తండ్రికూతుళ్తు బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా చేవెళ్ల సమీపంలో వెనకనుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక లారీ వాళ్ల బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు ఇద్దరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని తండ్రీకూతురు మృతి!
Accident

Updated on: Aug 25, 2025 | 10:38 PM

పాఠశాల నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొని తండ్రీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రవీందర్ అనే వ్యక్తి సోమవారం చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న తన కూతురిని స్కూల్‌ నుంచి ఇంటికి తీసువచ్చేందుకు వెళ్లాడు. పాఠశాల ముగిసిన తరువాత రవీందర్ తన కుమార్తెను తీసుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అయితే మార్గమధ్యలోకి రాగానే వెనకనుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక లారీ.. వాళ్ల బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో తండ్రికూతుళ్లు బైక్‌పై నుంచి కిందపడిపోయారు.

లారీ వాళ్లపై నుంచి వెళ్లడంతో తండ్రీకూతుళ్లు ఇద్దరు తీవ్ర గాయాలపై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైర్‌ను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు.

విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కూతురిని తీసుకొస్తానని వెళ్లిన తండ్రి,కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.