Hyderabad: కేసు పెట్టిన కోడలు.. కుటుంబం అంతా వచ్చి.. హైదరాబాద్‌లో హోటల్ రూమ్‌ తీస్కోని

కోడలు వేధింపులు కారణంగా చూపుతూ కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హూటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Hyderabad: కేసు పెట్టిన కోడలు.. కుటుంబం అంతా వచ్చి..  హైదరాబాద్‌లో హోటల్ రూమ్‌ తీస్కోని
Family Suicide Attempt
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2024 | 4:22 PM

-కోడలు వేధింపులను కారణంగా చూపుతూ.. అత్తింటి కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది.హోటల్‌లోని మూడవ అంతస్తు రూం నెంబర్‌ 308లో ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ త్రి స్టార్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

-స్పాట్‌ని పరిశీలించిన పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన ముగ్గురు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన తండ్రి నారాయణ, తల్లి పద్మావతి , కొడుకు సృజన్‌గా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న కొడుకు సృజన్‌కు వివాహం చేశారు పెద్దలు.

-కొద్ది రోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. దీంతో కోడలు కావ్య భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు సృజన్‌పై 498 A కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరు కోడలు కావ్వకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. తను పట్టు వీడలేదు. దీంతో మనస్తాపం చెందిన ముగ్గురు సికింద్రాబాద్ చేరుకుని తాజ్ త్రి స్టార్ హోటల్‌లో దిగారు. తరువాత ముగ్గురు కలిసి కోడలికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పారు.

-అవమానం భరించలేమంటూ జ్యూస్‌లో మత్తు మందు కలిపి తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హూటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.