మియాపూర్ ఏరియాలో ఉండే ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అరబిందో కాలనీలో కొత్తగా ఫుడ్ కోర్టు అందుబాటులోకి వచ్చింది. “F3 ఫుడ్ కోర్ట్”ను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ దీన్ని ప్రారంభించారు. అదీ, ఇదీ అని కాకుండా.. కాఫీ, టీ, బిర్యానీ, పలావ్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ బాదంపాలు.. ఇలా అన్ని ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మెయిన్ రోడ్డుకి సమీపంలోనే ఈ ఫుడ్ కోర్టు ఉంది. ఇంకో క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఇక్కడే గేమింగ్ క్లబ్ కూడా ఉంది. ఇక కిడ్డీ పార్టీలు కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన హాల్ కూడా ఉంది. ఇలా ఫుడ్ నుంచి ఫన్ వరకు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.
ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ… మంచి ప్రాంతంలో ఈ కోర్టు ఏర్పాటు చేశారని.. నాణ్యమైన రుచికరమైన ఫుడ్ అందిస్తూ.. నిర్వాహకులు ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాక్షించారు. క్వాలీటీ విషయంలో రాజీ పడకుండా ఉంటే.. ఫుడ్ లవర్స్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..