Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu – Revanth Reddy: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. పెండింగ్‌‌లో ఉన్న అంశాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు.

Chandrababu - Revanth Reddy: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. పెండింగ్‌‌లో ఉన్న అంశాలు ఇవే..
Chandrababu - Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 03, 2024 | 9:59 AM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్ధిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్థులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయం వంటి 30 సంస్థల ఆస్థులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలున్నాయి. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.

పెండింగ్‌ అంశాలు ఇవే..

  • విభజన చట్టంలోని ఆస్తుల పంపిణీ
  • షీలా బిడే కమిటీ సిఫార్సుల అమలు
  • ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం ఆస్తుల వాటా
  • తెలంగాణకు 42 శాతం ఆస్తుల వాటా
  • 7 విలీన మండలాలపై చర్చించే అవకాశం
  • షెడ్యూల్‌ 9లో మొత్తం 91 సంస్థలు
  • ఆర్టీసీ, రాష్ట్ర ఆర్ధిక సంఘం వంటి 23 కార్పొరేషన్ల ఆస్తులు
  • షెడ్యూల్ 10లో మొత్తం 142 సంస్థలు
  • తెలుగుఅకాడమీ, అంబేద్కర్, తెలుగువర్శిటీ వంటి 30 సంస్థల ఆస్తులు
  • రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి..
  • వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలు
  • షెడ్యూల్‌ 9లో రూ.24,019 కోట్ల విలువైన ఆస్తులు
  • షెడ్యూల్‌ 10లో రూ.34,643 కోట్ల విలువైన ఆస్తులు
  • నీటి పంపకాలు, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ అంశం

ఈ అంశం పొలిటికల్‌గానూ చర్చనీయాంశవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్‌కు లేఖరాయడంపై.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూర్చుని చర్చించుకోవడం మంచి పరిణామమేనన్న మాజీ మంత్రి బీఆర్ఎస్.. దీనికి కొన్ని కండిషన్లు సూచించింది. రాష్ట్రవిభజన జరిగిన కొత్తలో… పోలవరం కోసం, ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేలా చంద్రబాబుతో చర్చలు జరపాలని హరీశ్ రావు సూచించారు. దాని తర్వాతే మరేదైనా అన్నట్టుగా చర్చలు ఉండాలన్నారు.. కాగా.. ఈనెల 6న జరిగే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ సఫలం అవుతుందా? పదేళ్లుగా పడి ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..