గుడ్ న్యూస్ అంటే ఇదే.. ఇకపై ప్రభుత్వ బడుల్లో నర్సరీ.. 4వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పు మార్క్‌.. పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంస్కరణలపై దృష్టిసారించింది. విద్యాశాఖను నిర్వహిస్తోన్న సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు.

గుడ్ న్యూస్ అంటే ఇదే.. ఇకపై ప్రభుత్వ బడుల్లో నర్సరీ.. 4వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు
CM Revanth Reddy

Updated on: Oct 18, 2025 | 9:59 AM

తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పు మార్క్‌.. పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంస్కరణలపై దృష్టిసారించింది. విద్యాశాఖను నిర్వహిస్తోన్న సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. చదువుతో పాటు విద్యార్ధుల్లో ఆసక్తి పెంచేలా చూడాలన్నారు. ప్రతి స్కూల్‌లో తగినన్ని తరగతి గదులతో పాటు ప్లే గ్రౌండ్‌ ఉండాలన్నారు. కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా గవర్నమెంట్‌ స్కూల్‌ను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు..

ముందుగా ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలన్నారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే ఏడాది.. 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి నూతన కార్యచరణ అమల్లోకి వచ్చేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఉన్నతాధికారులు.

కాగా.. అంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి నర్సరిని స్కూళ్లల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. నర్సిరీ కోసం వేలు రూపాయలు సామాన్యులు ప్రైవేటు స్కూళ్లల్లో ఇచ్చి చదివిచ్చుకుంటున్నారని.. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరి విద్యను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక పాఠశాలలతో సమాన్యులకు మేలు జరుగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..