Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. ఈ మార్గాల్లో 3 నెలలు ట్రాఫిక్‌ ఆంక్షలు. పూర్తి వివరాలు.

|

Mar 09, 2023 | 9:29 PM

ఇందిరా పార్క్‌ నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ద్వారా ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టాలని జీహెచ్‌ఎంసీ చూస్తోంది. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు...

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. ఈ మార్గాల్లో 3 నెలలు ట్రాఫిక్‌ ఆంక్షలు. పూర్తి వివరాలు.
Hyderabad Traffic
Follow us on

ఇందిరా పార్క్‌ నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ద్వారా ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టాలని జీహెచ్‌ఎంసీ చూస్తోంది. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మూడు నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో భాగంగానే మూడు నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రక‌టించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహ‌న‌దారులు.. ట్రాఫిక్ పోలీసులకు స‌హ‌క‌రించాల‌ని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.

* చిక్కడ‌ప‌ల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ న‌గ‌ర్ మీదుగా వెళ్లే వాహ‌న‌దారులు.. సుధా నందిని హోట‌ల్ లేన్ వ‌ద్ద లెఫ్ట్ తీసుకొని సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్ట్రీట్ నంబ‌ర్ 9 మీదుగా అశోక్ న‌గ‌ర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కు చేరుకోవాలి.

* వీఎస్‌టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ న‌గ‌ర్ వెళ్లే వారు.. క్రాస్ రోడ్డులోని హేబ్రోన్ చ‌ర్చి లేన్‌, ఆంధ్రా కేఫ్, జ‌గ‌దాంబ హాస్పిట‌ల్ మీదుగా అశోక్ న‌గ‌ర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కుకు చేరుకోవాలి.

ఇవి కూడా చదవండి

* ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వ‌చ్చే వాహ‌నదారులు.. అశోక్ న‌గ‌ర్ క్రాస్ రోడ్స్ నుంచి జ‌గ‌దాంబ హాస్పిట‌ల్, ఆంధ్రా కేఫ్, హేబ్రోన్ చ‌ర్చి, చిక్కడప‌ల్లి మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి. అశోక్ న‌గ‌ర్ ఎక్స్ రోడ్డు నుంచి స్ట్రీట్ నంబ‌ర్ 9 మీదుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోట‌ల్ లేన్, చిక్కడ‌ప‌ల్లి మెయిన్ రోడ్డు చేరుకోవాలి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..