
పేదోడి వ్యాధులను టార్గెట్ చేసుకుంటూ సాగుతున్న అక్రమ మెడిసిన్ దందాపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చూపరులను ఆకట్టుకునేలా తప్పుడు ప్రకటనలు చేస్తున్న నకిలీ మెడిసిన్‌పై డ్రగ్ కంట్రోల్ దృష్టి సారించారు. మనుషుల జబ్బులకు ఈ ప్రత్యేక ఆయిల్ వాడితే మటుమాయం అవుతాయని నమ్మబలికే మాటలు చెప్పి ఆయిల్ తయారు చేసి అమ్ముతున్న ముఠాకు చెక్ పెడుతున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.
తెలంగాణలో గత మూడు నెలల నుంచి డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు ఎక్కువయ్యాయి. అనధికారిక నిల్వలు, ఇల్లీగల్ డ్రగ్ కార్యకలాపాలు, ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులు, కల్తీ మెడిసిన్ లాంటి వాటిపై దృష్టి సారించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు.. ఆకస్మిక తనిఖీలు చేస్తూ పలు మెడిసిన్స్ పట్టుకుంటున్నారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు రెండు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసారు. హైదరాబాద్‌లోని శాలిబండలో తనిఖీ చేసి అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, ఆయో ఆర్గానిక్ వాల్‌నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజి ఆయిల్స్ సీజ్ చేసారు. నల్గొండ జిల్లా ఇర్కిగూడెం గ్రామం దామెరచర్ల మండలంలో ఓఆర్ఎంపి వద్ద 45 వేల రూపాయల మెడిసిన్స్ సీజ్ చేసారు. ఇలా నకిలీ మెడిసిన్స్, కల్తీ వాటిపై దృష్టి సారించి సీజ్ చేస్తూ నిర్వాహకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసు నమోదు చేసారు.
తప్పుడు ప్రకటనలు చేస్తున్న షాపులు, మెడిసిన్‌పై దృష్టి సారించిన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, ఆయో ఆర్గానిక్ వాల్‌నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజి ఆయిల్స్ పేరుతో నకిలీవి తయారు చేస్తున్నారని గుర్తించారు. మనుషుల వ్యాధులకు సంబంధించి క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు మాయమవుతాయంటూ తప్పుడు ప్రకటనలు చేస్తుండడంతో హైదరాబాద్ శాలిబండలో పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ జోన్ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, ఆయో ఆర్గానిక్ వాల్‌నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కలోంజి ఆయిల్స్ అన్ని బాటిల్స్‌ని సీజ్ చేసారు. పట్టుబడ్డ స్టాక్ మొత్తం 21 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటివి ఎక్కువగా అనారోగ్య బారిన పడేలా చేస్తాయని, క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం జబ్బులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు నల్గొండ జిల్లాలోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇర్కిగూడెం గ్రామం దామెరచర్ల మండలంలో ఓ మెడికల్ షాపులో తనిఖీ చేసారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆర్ఎంపిగా దాసరి మల్లయ్య మెడికల్ షాపు నిర్వహిస్తూ, క్లినిక్ పేరుతో వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించారు. రైడ్ చేసిన క్రమంలో 41రకాలైన 45 వేల రూపాయల విలువ గల మెడిసిన్స్ సీజ్ చేసారు. పట్టుబడ్డ మెడిసిన్‌లు అన్ని కూడా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, అనాల్జెసిక్స్, దగ్గు సిరప్‌లు, యాంటీ అల్సర్, యాంటీ డయాబెటిక్స్, యాంటీహైపెర్టెన్సివ్స్ మందులుగా గుర్తించారు. ఆర్ఎంపిగా అక్రమంగా నిర్వహిస్తున్న దాసరి మల్లయ్య మెడికల్ షాపుకు ఎవరు ఎలా మెడిసిన్స్ ఇస్తున్నారనేదానిపై నల్గొండ యూనిట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారణ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా డ్రగ్స్ నిర్వహణ, డ్రగ్స్ అమ్మకాలు చేసినా నేరమని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆర్ఎంపిలను హెచ్చరిస్తున్నారు.