Meru International School: పిల్లల్లో ఆసక్తి పెంపొందించడం కోసం మనం కూడా మారాల్సిందే.. ఇండో-ఫిన్నిష్ కాన్ఫరెన్స్‌‌లో ‘మేరు’ ప్రతినిధులు

|

Nov 29, 2021 | 7:38 PM

Meru International School: కరోనావైరస్ మహమ్మారితో విద్యారంగం పూర్తిగా కుదేలయింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత పరిస్థితులు మారడంతో విద్యారంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. అయితే.. మహమ్మారి సమయంలో

Meru International School: పిల్లల్లో ఆసక్తి పెంపొందించడం కోసం మనం కూడా మారాల్సిందే.. ఇండో-ఫిన్నిష్ కాన్ఫరెన్స్‌‌లో ‘మేరు’ ప్రతినిధులు
Meru International School
Follow us on

Meru International School: కరోనావైరస్ మహమ్మారితో విద్యారంగం పూర్తిగా కుదేలయింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత పరిస్థితులు మారడంతో విద్యారంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. అయితే.. మహమ్మారి సమయంలో ముఖ్యంగా విద్యారంగంలో సాంకేతిక నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్చువల్ ద్వారానే క్లాసుల నిర్వహణ జరిగింది. అయితే.. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిందేనని మహమ్మారి నిరూపించిందని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధులు పేర్కొన్నారు. పిల్లల్లో ఆసక్తి పెంపొందించడం అనే అంశంపై (Initiatives on nurturing kids curiosity) హైదరాబాద్ చందానగర్‌ మదీనాగుడలోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోద్ పిళ్లై, అంతర్జాతీయ విద్యావేత్త అలెజాండ్రా చావెజ్ ప్రసంగించారు. ఈ ఇండో-ఫిన్నిష్ కాన్ఫరెన్స్‌ (INDO – FINNISH CONFERENCE) లో వారు పిల్లలు, విద్యారంగం పరిస్థితులు, సవాళ్లు – మార్పులపై పలు కీలక విషయాలను వెల్లడించారు.

‘‘మారుతున్న కాలంతోపాటు మనం కూడా కచ్చితంగా మారాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. మహమ్మారితో పాటు, జనరేషన్లో కూడా మార్పు వచ్చింది. ముఖ్యంగా 2010 నుంచి 2024 వరకు జన్మించిన పిల్లల్లో ఈ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా సాంకేతికత ప్రపంచం, మహమ్మారి యుగంలో జన్మించిన వారు చరిత్రలో అత్యంత విద్యావంతులైన తరం కానున్నారు. మున్ముందు వాస్తవికతతో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కానున్నారు. దీనిలో సోషల్ మీడియా వారి ప్రధానమైన ఆయుధంగా మారనుంది’’ అని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధులు పేర్కొన్నారు.

విద్యార్థుల్లో ఉత్సుకతను పెంపొందించడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మన మనస్సులో ఉన్నట్లుగానే.. పిల్లల్లో కూడా ప్రశ్నలు మొదలవుతాయని.. వాటికి ముఖ్యంగా సమాధానమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే వాటికి అనుగుణంగా మేరులో తాము ప్రశ్నించే వాటికి.. ఎందుకు అనే పదానికి ఎక్కువగా ప్రోత్సహిస్తామన్నారు. తమ పిల్లల ఉత్సుకతకు సహాయపడే వ్యూహాలకు అనుగుణంగా తాము ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. తమ స్కూల్‌లో చదివే పిల్లలు ఆరోగ్యకరమైన ప్రశ్నలను అడగాడాన్ని తాము అభినందిస్తున్నామని.. వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. పిల్లల నుంచి పశ్నలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నప్పటికీ.. తమ ఉపాధ్యాయులు ఓపికతో సమాధానమిస్తున్నారని మేరు ప్రిన్సిపాల్ ప్రమోద్ పిళ్లై తెలిపారు.

మెరు (Meru International School) లో సహజసిద్దంగా ఆసక్తి ఏర్పడేటట్లు, సృజనాత్మకత ఆధారంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నామన్నారు. పిల్లలను వేధించకుండా నడుస్తున్న ప్రపంచానికనుగుణంగా పిల్లలను ప్రోత్సహిస్తామన్నారు. మంచి ప్రేరణతో, పిల్లల భవిష్యత్తు కోసం అంకితభావంతో విద్యాబోధనలు అందించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రమోద్ పిళ్లై వెల్లడించారు.

కరోనా మహమ్మారి నుంచి బోధనలో ఎన్నో సవాళ్లు, మార్పులు ప్రారంభమయ్యాయని.. వాటి ద్వారా కొన్నింటిని నేర్చుకున్నామని పేర్కొన్నారు. అవి సాంకేతికకు అనుకూలంగా మార్చాయని పేర్కొన్నారు. దీని ద్వారా తమ ఉపాధ్యాయులలో చాలా మంది ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా బోధించగలుగుతున్నారతపతాకగ. సాంకేతికతతో కూడిన కొత్త పంథా మనల్ని నేర్చుకునేలా ప్రేరేపించడమే కాకుండా పిల్లలను కూడా భాగస్వామ్యం చేసిందని మేరు ప్రిన్సిపాల్ ప్రమోద్ పిళ్లై పేర్కొన్నారు.

దీనికనుగుణంగా దేశంలోని విద్యా వ్యవస్థ కూడా మారాలని నిరుపిస్తుందన్నారు. ఆ కలలను సాకారం చేసేందుకు మరింత శిక్షణ పొందిన ఉపాధ్యాయులను కలిగి ఉండాలన్నారు. అప్పుడే మనం సరైన దిశలో పయనిస్తామని ప్రిన్సిపాల్ ప్రమోద్ పిళ్లై పేర్కొన్నారు. అత్యున్నత బోధన, మంచి మార్కులతో తమ పిల్లల తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందనను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. తమ M-CLAP ప్రోగ్రామ్‌తో పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికతో కూడిన బోధన, అన్ని విషయాలను నేర్పుతున్నామమని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోద్ పిళ్లై పేర్కొన్నారు.

Also Read:

LPG Subsidy: గ్యాస్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ.587కే సిలిండర్.. సబ్సిడీ పొందండి ఇలా..

Rajya sabha: పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు షాక్.. రాజ్యసభలో ఆ 12మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు..