Hyderabad: హిట్ అండ్ రన్ కేసు.. తీవ్రంగా గాయపడిన డాక్టర్ మృతి.. తల్లి చనిపోయి నెల రోజులు కాకముందే..

|

Sep 24, 2022 | 11:22 AM

హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ శ్రావణి మృతి చెందింది. హస్తినాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్న శ్రావణి.. ఇంటికి వెళ్లేందుకు..

Hyderabad: హిట్ అండ్ రన్ కేసు.. తీవ్రంగా గాయపడిన డాక్టర్ మృతి.. తల్లి చనిపోయి నెల రోజులు కాకముందే..
Accident
Follow us on

హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ శ్రావణి మృతి చెందింది. హస్తినాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్న శ్రావణి.. ఇంటికి వెళ్లేందుకు ఓలా బైక్ ను బుక్ చేసుకుంది. ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓలా బైక్‌ డ్రైవర్‌ వెంకటయ్యకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు కన్ను మూసింది. కాగా.. 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండె పోటుతో చనిపోయింది. ఆమె చనిపోయి నెల రోజులు కూడా కాకముందే రోడ్డు ప్రమాదంలో శ్రావణి మృతి చెందడం ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అతడికి లైసెన్స్‌, కారుకు పేపర్లు సైతం లేవని నిర్ధరించారు.

Doctor Sravani

Doctor Sravani

హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తృతి చెందుతూ ప్రపంచ ఖ్యాతిని గడిస్తోంది. అయితే ఆశించిన మేరకు రహదారుల విస్తరణ లేకపోవడంతో భారీగా ట్రాఫిక్ నెలకొంటోంది. ట్రాఫిక్ లోనే గంటలకు గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుండటంతో కొందరు ఆగకుండా సిగ్నల్స్ క్రాస్ చేసేస్తున్నారు. మరికొందరు వేగంగా వెళ్లాలనే ఆతృతలో ముందు వస్తున్న వారిని కూడా పట్టించుకోకుండా ఢీ కొడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయి. తాజాగా డాక్టర్ శ్రావణి మృతి కేసు.. హైదరాబాద్ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్లపై వేగంగా వెళ్లే వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..